ఆర్టికల్ 370 రద్దు విషయంపై పక్కనే ఉన్న బాంగ్లాదేశ్ తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలు కామ్ గా ఉంటున్న సంగతి తెల్సిందే.  అది ఇండియా అంతర్గత విషయం అని పక్కన పెట్టాయి.  కానీ, పాకిస్తాన్ మాత్రం పదేపదే పదేపదే ఇదే ఇష్యూ మీద రగడ చేస్తూనే ఉన్నది.  370 రద్దు కారణంగా కాశ్మీర్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇది అన్యాయం అని, అక్కడి ప్రజలను, అసెంబ్లీని అడగకుండా రద్దు చేసిందని పాకిస్తాన్ రగడ చేస్తున్నది.  


ఇండియా మాత్రం ఇది తమ అంతర్గత విషయం అని, దీనిపై ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని, మండిపడుతున్నాడు.  ఆర్టికల్ 370 రద్దయింది.. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయ్యాయి.  ఇక మిగిలింది పీవోకే.  పీవోకే విషయంలో మాత్రమే పాకిస్తాన్ తో చర్చలు జరుపుతామని భారత్ చెప్పింది.  


పాకిస్తాన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది.  అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ట్రై చేస్తున్నది. పదేపదే అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒత్తిడి తెస్తున్నది.  పాక్ దూకుడు తగ్గించుకుంటే మంచిది అని ఇప్పటికే చెప్పారు.  కానీ, పాక్ మాత్రం తన పద్దతిని మార్చుకోవడం లేదు.  దీంతో జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోడీతో ఈ విషయంపై చర్చించనున్నారు. 


మోడీ మాత్రం మూడో దేశం మధ్యవర్తిత్వం వహించేందుకు ససేమిరా అంటున్నాడు.  ఇది పాక్ కు మింగుడు పడటం లేదు.  అటు ఫ్రాన్స్ పాక్ కు ఈ విషయంలో సలహా ఇచ్చింది.  ద్వైపాక్షిక అంశం అని సానుకూల వాతావరణంలో చర్చించుకోవాలని చెప్పింది.  మరోవైపు పాకిస్తాన్ నుంచి విడిపడి  అవతరించిన బాంగ్లాదేశ్ కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తోంది.  కాశ్మీర్ అంశం ఇండియా అంతర్భాగ విషయం అని, దీనిపై పాకిస్తాన్ కలగజేసుకోవడం బాగాలేదని చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: