ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా భాద్యతాయుతంగా ప్రవర్తించాలి. అయినా దానికి కాని దానికి అధికార పార్టీ మీద విమర్శలు చేస్తే ప్రజలు హర్శించరు. కానీ ఏపీలో మాత్రం ప్రతి పక్ష నాయకులకు అసలు ఓపిక లేకుండా పోతుంది. జగన్ అత్యంత భారీ మెజారిటీతో కనీ వినీ ఎరుగని రీతిలో అధికారంలోకి వచ్చారు. అలాంటపుడు ప్రతి పక్ష పార్టీలు చాలా జాగ్రత్తగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో మన ప్రతి పక్ష పార్టీలు అప్పుడే జగన్ మీది దుమ్మెత్తి పోస్తున్నారు. విమర్శలు చేస్తే గాని మనుగడ ఉండదని వేరు భావిస్తున్నారేమో .. అందుకే పొద్దున్నే లేసిన నుంచి సర్కార్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం 151 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని కైవసం చేసుకుంది.


టీడీపీ పార్టీకి కేవలం 23 స్థానాలు కట్టబెట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆ పార్టీ మీద ప్రజలకు ఎంత కసి, కోపం ఉందో .. కానీ టీడీపీ పార్టీకి అవన్నీ పట్టినట్లు లేవు. ఎన్నికల ఘోర పరాజయానికి ఆత్మ పరిశీలన చేసుకోవటం మానేసి ఇంకా మూడు నెలలు కూడా నిండని సర్కార్ మీద ఎదురుదాడి చేస్తే .. మొదటికే మోసం వస్తుందన్న సంగతీ గ్రహించడం లేదు. అయితే  జగన్ ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రతి పక్ష పార్టీలు ఆచీ తూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజల్లో పలచబడిపోతారు.


అయితే మొదట్లో ప్రతి పక్షాలు .. టీడీపీ కావొచ్చు ..జనసేన .. బీజేపీ ఇలా అందరూ జగన్ ప్రభుత్వానికి ఆరు నెలల వ్యవధి సమయం ఇస్తామని చెప్పారు. తరువాత పాలనాపరమైన ఇబ్బందులు వస్తే విమర్శిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా అందరూ యూ టర్న్ తీసుకున్నారు. టీడీపీ పార్టీ అయితే ఎప్పుడో విమర్శలు మొదలు పెట్టింది. లోకేష్ ట్వీట్ల రూపంలో .. బాబుగారు మీడియా సమక్షంలో జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు . జగన్ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పధకాలు ఎక్కడ మంచి పేరు తెస్తాయో నని టీడీపీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: