Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 6:40 am IST

Menu &Sections

Search

మోడీ డైరెక్షన్లోనే జగన్... పచ్చ పార్టీకి బ్యాండ్ బాజాయేనా...!!

మోడీ డైరెక్షన్లోనే జగన్... పచ్చ పార్టీకి బ్యాండ్ బాజాయేనా...!!
మోడీ డైరెక్షన్లోనే జగన్... పచ్చ పార్టీకి బ్యాండ్ బాజాయేనా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ మీద వూరికే విరుచుకుపడిపోతున్న పసుపు తమ్ముళ్ళు అయిదేళ్ల పాటు తాము ఏపీకి ఏం ఒరగగెట్టారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. అమరావతి రాజధాని నుంచి పోలవరం వరకూ ఎక్కడ ఏం దొరికినా నొక్కేసే కార్యక్రమానికి  నాటి టీడీపీ ప్రభుత్వంలో  తమ్ముళ్ళు చేసిన దందా మోడీ సర్కార్ కి కూడా మంట పుట్టించిన సంగతి విధితమే. అందుకే ఆయన పోలవరం టీడీపీకి  ఏటీఎం గా మారింది అన్నది. ఇక అమరావతి తీరు చూసి నిధులు కూడా ఇవ్వకుండా అపేసింది కూడా గత సర్కార్ నిర్వాకం వల్లనే.


ఇపుడు భారీ ఓటమి తరువాత కిందా మీదా పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న పసుపు పార్టీ తన అనుచరులను కొందరిని బీజేపీలోకి పంపించి అద్దె గొంతుకలతో జగన్ మీద విమర్శలు చేసినంత మాత్రాన జగన్ సర్కార్ పని అయిపోయినంతగా సంబరపడుతోంది. నిజానికి జగన్ కి బీజేపీకి సంబంధాలు చాలా పదిలంగా ఉన్నాయి. అందుకే అంతరాష్ట్ర మండలిలో జగన్ కి సభ్యత్వం దక్కింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ కి కూడా కేంద్రానికి చెప్పే జగన్ చేస్తున్న సంగతి పచ్చ పార్టీకి తెలియకపోవడమే అసలైన రాజకీయం. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ పెద్ద దిక్కు విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో చెబుతూ మోడీ, అమిత్ షాలతో చెప్పి రివర్స్ టెండరింగ్ కి వెళ్లామని అన్నారు. దీంతో పచ్చ పార్టీ నేతలకు పచ్చి వెలక్కాయ పడ్డట్టేనని అంటున్నారు.


ఇక అమరావతి  రాజధాని విషయంలోనూ జగన్ మోడీ డైరెక్షన్లోనే నడుస్తున్నారని అంటున్నారు. అమరా వతి ఇపుడున్న డిజైన్లు, రూపకల్పనను బట్టి చూస్తే  ఎట్టి పరిస్థితుల్లొనూ  మరో ఇరవయ్యేళ్ళు గడచినా పూర్తి కాదు అన్నది కేంద్రానికి కూడా అర్ధమైంది. కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఏ మూలకు సరిపోనంతగా భారీ బడ్జెట్ తో రాజధాని గ్రాఫిక్స్ ని బాబు తయారు చేసిపెట్టారు. ఇక శివ‌రామక్రిష్ణ‌న్ కమిటీ నివేదికను సైతం బుట్టదాఖలు చేసి అస్మదీయుల కోసమే రాజధాని అన్నట్లుగా వ్యవహరించారు. ఇవన్నీ మోడీకి తెలియవు అనుకుంటే పొరపాటే. అందుకే ఆయన శంఖుస్థాపనకు వచ్చి నీళ్ళు, మట్టి ఇచ్చి వెళ్ళారు. ఇక జగన్ రాజధానిని  మార్చి తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కట్టుకుంటే కేంద్ర సాయం తప్పక ఉంటుందన్నది కూడా అర్ధమవుతోంది. అందుకే జగన్ సర్కార్ తెల్ల ఏనుగు లాంటి అమరావతి విషయంలో మౌనం పాటిస్తోంది. 


ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా వైసీపీ సర్కార్ ని ప్రశంసలతో  ముంచెత్తడం తాజా పరిణామం. ఈ రోజు ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో ఎంపీలు ఆయన్ని కలసినపుడు ఏపీలో ఉన్నది స్నేహపూర్వకమైన సర్కార్ అని పేర్కొన్నారు. తాము తప్పక ఏపీకి అండగా ఉంటామని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఏపీకి సంబంధించి ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ముందుగా కేంద్రానికి చెప్పే చేస్తున్నారన్నది క్లారిటీగా అర్ధమవుతోంది. మరి ఏపీలో టీడీపీ తమ్ముళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా సుఖం లేదన్నది కూడా దాన్ని బట్టే తెలుస్తోంది. సో.. పచ్చ గ్యాంగ్ బహు పరాఖ్ అంటున్నాయి ఢిల్లీ పరిణామాలు.



jagan-,modi-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ రివర్స్ జోరు...!!
పవన్ అలా డిసైడ్ అయిపోయాడా..!?
ఉయ్యాలవాడ కుటుంబానికి 50 కోట్లు ఇవ్వలేదట...!!
ఆ టాప్ సాంగ్ క్రియేటర్ క్రేజీ ఫీలింగ్స్...!!
ఆ మీడియాపై ప్రభుత్వం కేసు పెడుతుందా...!?
జగన్ మీద బురద ...!!
చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!
వైసీపీకి బాబు మార్క్ రీచార్జ్ ...!
బాబుని నమ్మని బీజేపీ..!!
నయన్.. కళ్లకు ఏమైంది...!!
టీడీపీ కంచుకోటలో వైసీపీ దూకుడు...!!
కోడెల ఎపిసోడ్... టీడీపీ భరోసా దక్కలేదా...!!
జూనియర్ నమ్మి చాన్స్ ఇస్తే...!!
కోడెల కోరిక తీర్చని బాబు...!?
హాటీ ఇమేజ్ కంటిన్యూ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.