సాయంత్ర సమయంలో బీచ్ రోడ్డులో నడుస్తూంటే అలలు అలా కాళ్ళను తాకుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. బీచ్ ప్రేమికులకు ఈ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు వెంబడి బీచ్ లో కూడా గత ఆదివారం రాత్రి అలలు వచ్చాయి. కానీ ఆ అలలను చూసి ప్రజలు, సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు.  


సముద్రంలో సరికొత్త రంగులతో అలలు కనువిందుచేయడంతో సందర్శకులు కొంత భయాందోళన చెందారు. ఆ అలలు అందంగా ఉన్నప్పటికీ భయానికి గురిచేస్తున్నాయి. చెన్నై బీచ్ లో గత ఆదివారం రాత్రి నీలిరంగు అలలు తీరం వైపు కొట్టుకువచ్చాయి. చీకట్లో మెరుస్తూ వచ్చిపోయిన నీలిరంగు అలలు సందర్శకులను కన్నార్పకుండా చేశాయి. 


అరుదుగా వచ్చే ఈ అలల ఫొటోలు, వీడియోను సందర్శకులు తమ సెల్ ఫోన్లలో బందించారు. అయితే ఈ అలల వెనుక చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయో లుమినిసెన్స్‌గా పేర్కొనే ఈ పరిణామం సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్‌ అనే సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడుతుందని,  ఈ సూక్ష్మజీవులు ఉన్న ప్రాంతంలో చేపలు ఇతర జలచరాలు సైతం జీవించలేవని నిపుణులు తెలుపుతున్నారు. అలలు నీలి రంగులోకి మారడం ప్రమాదకరమని వారు అబిప్రాయపడుతున్నారు. ఈ అలల ద్వారా చెన్నై ప్రజలను సముద్రం హెచ్చరిస్తుంది అని నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ అలలను చుడానికి ప్రజలు ముందు వస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: