దేశ వ్యాప్తంగా సాగిన ఓ గొలుసు కట్టు మోసం హైదరాబాద్ విద్యార్థుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. రెండు వేల ఒకటి నుంచి దేశంలోని వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న మోసం గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. విద్యార్థులు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఐదువేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ ఈ బిజ్ కంపెనీ నిర్వాహకులను కటకటాల వెనక్కి నెట్టారు. మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల ఈ బిజ్ ఆస్తులను జప్తు చేశారు.

హర్యాన లోని నోయిడా సెక్టార్ అరవై మూడు లో రెండు వేల ఒకటి లో ఈ బిజ్ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది.నోయిడాకు చెందిన పవన్ మల్హార్ ఈబీజ్ ఎంపిగా, ఆయన భార్య అనిత మల్హాండ్ డైరెక్టర్ గా రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో నమోదైంది. వారి కుమారుడు హితిక్ మల్హాన్ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. విద్యార్థులు నిరుద్యోగులు లక్ష్యంగా ఈ బిజ్ తన గొలుసుకట్టు మోసం ప్రారంభించింది. దుస్తులూ, ఈ లెర్నింగ్ కోర్సులు, విహార యాత్రల ప్యాకేజీల ఆశ చూపి ఈ మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలను వసూలు చేసేవారు.

నెల రోజుల్లోనే ఆ మొత్తం రాబట్టుకోవచ్చని నమ్మకంగా చెప్పడంతో వారి మాటలు విని తొలుత కొందరు సభ్యత్వం తీసుకున్నారు.నెల రోజులైనా డబ్బు తిరిగి రాకపోవడంతో సభ్యులు ఒత్తిడి చేశారు. అసలు విషయం బయటపెట్టి మరో ముగ్గుర్ని చేర్పిస్తేనే కమిషన్ రూపంలో డబ్బు వెనక్కి వస్తుందని చెప్పారు. దీంతో పాత సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త సభ్యులను చేర్పించేవారు. అలా అలా ఈ మోసాన్ని దేశమంతా వ్యాపింపచేశారు ఈ బిజ్ నిర్వాహకులు. మాయమాటలు చెప్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో పదిహేడు లక్షల మందిని ఈ మ్యూజియం నిర్వాహకులు సభ్యులుగా చేర్చుకున్నారు.ఐదు వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు.

జగిత్యాలకు చెందిన విద్యార్థి సామర్ల వివేక్ గత మార్చిలో హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ బిజ్ మోసం వెలుగు చూసింది. మార్చి లోనే సంస్థ పర్యవేక్షకుడు హితేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈబిజ్ కార్యకలాపాల వివరాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చి పంపించేశారు. అప్పటి నుంచి పవన్ గానీ హితిక్ గానీ నోటీసులపై స్పందించలేదు. విచారణకు హాజరు కావాలని పిలిచినా రాలేదు.

ఈ లోపు సనత్ నగర్ కు చెందిన విద్యార్థి మహమ్మద్ ఫారూఖ్ ఈ బిజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల బృందం నోయిడా వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుంది. ఈ బిజ్ వ్యవహారంలో మార్చిలోనే కేసు నమోదు చేశాము అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అప్పట్నుంచీ తండ్రీ కొడుకులు పరారీలో ఉన్నారన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: