ఇది కొత్త ట్రెండ్.. రాజకీయానికి మరో వేధికా. ఒకప్పుడు ఏదైనా చెప్పాలన్న.. విమర్శలు చెయ్యాలన్న.. పొగడాలన్న ప్రెస్ మీట్ పెట్టి తడబడకుండా మాట్లాడి చెప్పాలనుకున్న విషయాన్నీ క్లియర్ గా చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆలా కాదు. ఒక విషయం గురించి చెప్పాలంటే ఏ ప్రెస్ మీట్ అక్కర లేదు, పక్క ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. 


చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ట్విట్టర్ ఉంటె చాలు. ఒక్క ట్విట్ తో వన్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అలానే కేశినేని నాని, బుద్ధా వెంకన్న ప్రజల మధ్యలో ఎన్ని చేసిన ట్విట్టర్ లో ఒక గొడవ పడాలి అని ఒక్క రోజు మొత్తం ట్విట్టర్ లో వారి బాగోతాలను వారే బయట పెట్టుకొని ట్విట్ స్టార్లు అయిపోయారు. వాళ్ళు ట్విట్ పెట్టగానే ప్రతి వెబ్ సైట్ లో ఆ వార్త ప్రచురితం అవుతుంది. అంత పాపులారిటీ తెచ్చుకున్నారు ఈ ట్విట్టర్ నేతలు. 


మరో వైపు విజయసాయి రెడ్డి, నారా లోకేష్ వీరి వార్ చూస్తే చిన్నపుడు మనం ఎంతో ఇష్టంగా చుసిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గుర్తొస్తాది. టామ్ అండ్ జెర్రీ చిన్న పిల్లలకు నవ్వు తెప్పిస్తే వీరి గొడవలు రాజకీయాలు ఫాలో అయ్యే పెద్ద వాళ్లకు కామెడీగా అనిపిస్తాయి. అలా ఉంటాయి వీరి ట్విట్లు. ఈ ట్విట్ల గోల మాములుగా ఉండదు. ఒకరు ఎద్ధి కరెక్ట్ అంటే మరొకరు కాదు అంటారు. 


నారా లోకేష్ ముర్కత్వం విజయ సాయి రెడ్డి తెలివితో ఉన్న ట్విట్లు చూస్తే ఈ కామెడీ ఎప్పుడు ఆపుతారు బాబు అని అనిపించేలా ఉంటాయి. కాగా వీరిద్దరూ ట్వీట్లతో గొడవ పడుతుంటే మధ్యలో బుద్ధా వెంకన్న వచ్చి ఆ ట్విట్ల గొలను పిచ్చి పిచ్చి చేస్తాడు. దీంతో నెటిజన్లకు ఇప్పుడు సినిమాల కంటే వీరి ట్వీట్లే ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నాయి అని సర్వే చేసిన కొందరు నాయకులు చెప్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: