టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పై సెటైర్ లు వేశారు. తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, లోకేశ్ మాత్రం ఓడిపోయాక ట్విట్టర్ వదిలి బయటకు రావటం లేదంటూ కామెంట్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ధైర్యం ఉంటే జనం ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు.



దీనిపై మంత్రి అనిల్ కుమార్ మాటల్లో, "ట్విట్టర్ చిలక ఆంధ్ర పప్పు మహారాజు ట్వీట్ ఒకటి ఏదో పెట్టినట్టు ఉన్నాడు చూశాను నేను నీటిపారుదల నోటిపారుదల అని. సరే నాకు నీటిపారుదల ఉంది, నోటు పారుదల ఉంది అనుకున్న మంచిదే కనీసం నాకు నోరన్నా ఉంది. నీకు ఏదీ లేదు కదా స్వామి కనీసం ఇంత వరదలు వచ్చాయి, రాష్ట్రంలో ఒక పక్క నీళ్లు డ్యామ్స్ అన్ని నిండుతున్నాయి, బాగా ఉన్నాయి. పది సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చింది.



మంగళగిరిలో పోటీ చేశావు. మా తాత ఇది, మా నాన్న ఇది, మేమిన్ని రోజులు ఏలాము అని చెప్పి చిట్ట చివరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు.కనీసం నీకెంతో మంది ప్రజలు ఓట్లన్నా వేసుంటారు, కనీసం ఈ వారం రోజులు హైదరాబాద్ లో ఎక్కడో నక్కి ఇంట్లో దాక్కొనే బదులు వారం రోజుల్లో ఆ ప్రాంతంలో తిరుగున్న బాగుండు. అది లేదు. సరే కనీసం ప్రెస్  ముందుకొచ్చి మాట్లాడతాడా అంటే మనకి నోరు లేదు ఏమీ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని.



అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైపు కూడా మనం కాదు అది బెబ్బే .అది బెబ్బే, బయటకొచ్చి మాట్లాడలేకపోయే, ఇంక దేనికి స్వామి నువ్వు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. బొక్కబొర్లపడ్డారు అంట, ఎక్కడ బొక్కబోర్ల.? మీ జీవితాంతం బొక్కబోర్ల పడతా ఉంటారు, గుంటల్లో పడతా ఉంటారు మేము కాదు. ఒక పడవ పెట్టి ఫోటో పెట్టి దీనివల్ల మా ఇళ్లని ముంచేయాలనుకుంటున్నారు. వచ్చే వాటర్ పరిధి ఎంత.? డెబ్బై గేట్లు ఎత్తేసి ఉంటే ఒక గేటు దగ్గర పడవకొట్టుకుని వచ్చి అడ్డుపడితే, దాని వల్ల అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మీ అజ్ఞానమేంటో అని." ఈ విధంగా నారా లోకేశ్ చేసిన ట్వీట్ పై స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: