బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొత్త సినిమా సాహో కోసం యావత్ భారత్ దేశం ఎదురు చూస్తుంది. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకోని మూవీ లవర్ లేడు. స్టార్ గా తన మార్కెట్ ని ఇప్పటికే వందల వేల కోట్ల రేంజ్ కు తీసుకెళ్లిన ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ రావడం ఆశ్చర్యమే.



అయితే అది తానుగా వ్యక్తపరిచింది కాదు. డార్లింగ్ పెద్దమ్మ కృష్ణంరాజుగారి సతీమణి శ్యామలాదేవి దీని గురించి ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం వల్ల ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది.భవిష్యత్తులో ప్రభాస్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావచ్చని అలాంటి అవసరం ఉందనిపించినప్పుడు రావడం తప్పేమీ లేదన్న తరహాలో ఆవిడ చెప్పారు. గతంలో పెదనాన్న కృష్ణంరాజుగారు సైతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే వారు కానీ ఆశించిన స్థాయికి చేరుకో లేదన్నది నిజం, ఇప్పటికీ బీజేపీ లోనే కొనసాగుతున్న ఆయన గతంలో కేంద్రమంత్రి గా పని చేసిన అనుభవం ఉంది అని ఆవిడ తెలిపారు.



కానీ ప్రభాస్ గురించి ఇలాంటి టాపిక్ ఇప్పుడే రావడం తొందరపాటు అవుతుంది. ఇంకా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి అని అన్నారు. బాహుబలి, సాహోలకే ఏడేళ్ల కెరియర్ ని పణంగా పెట్టి దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఇక పై ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.ఒక పక్క ఈ వార్త రాజకీయంగా కాక పుట్టిస్తూ ఉండగా, మరో పక్క ప్రభాస్ రాజకీయ ప్రవేశం వెనుక సాగుతున్న ప్రయత్నాలపై ఆసక్తికర కథనాలు కొన్ని ఇలా ప్రచారంలో ఉన్నాయి.



కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రభాస్ కు రాజకీయాల్లో ప్రవేశించే ఆఫర్ వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రభాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో సాధ్య, అసాధ్యాలను పరిశీలించాలని అమిత్ షా నేతలకూ ఆదేశించారట. కృష్ణంరాజు బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్నారు.ఏ బాధ్యత అప్పగించినా ఆయన అంగీకరించే అవకాశముంది. కాని ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నాడు.



ఈ నేపధ్యంలో ప్రభాస్ బిజెపి ఆఫర్ ని అంగీకరిస్తాడా, లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రభాస్ కృష్ణంరాజు గురించి బిజెపి జాతీయ అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీలో ఏపి నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని అమిత్ షా నేతలకూ ఆదేశించారట. మొత్తానికి ఈ విషయంలో స్వయంగా ప్రభాస్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తేలిస్తే తప్ప నిజానిజాలు బయటపడవు.


మరింత సమాచారం తెలుసుకోండి: