Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

ఏపీ రాజ‌ధాని రేసులో మూడో పేరు... జ‌గ‌న్ చెక్ పెట్టేస్తాడా..!

ఏపీ రాజ‌ధాని రేసులో మూడో పేరు... జ‌గ‌న్ చెక్ పెట్టేస్తాడా..!
ఏపీ రాజ‌ధాని రేసులో మూడో పేరు... జ‌గ‌న్ చెక్ పెట్టేస్తాడా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజధాని అమరావతిలో ఉంటుందా? లేక మారిపోతుందా...? మారిపోతే ఎక్కడకి వెళుతుంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజల మనసులని తొలిచేస్తున్నాయి. ఇక రాజకీయ నేతలు తమకు ఇష్టం వచ్చిన ప్రకటనలు చేసి ప్రజలని మరింత కన్ఫ్యూజన్ లో నెట్టేస్తున్నారు. అటు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు రాజధాని అమరావతి నుంచి మారిపోతుందని  పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆ ప్రకటనలన్నిటిని కొట్టి పారేస్తూ సీఎం జగన్ అమరావతి విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు.


అమరావతే రాజధానిగా ఉంటుందని ఇందులో మార్పు లేదని ప్రకటన కూడా చేశారు. కానీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ ప్రజలని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా కృష్ణా నదికి వరదల వచ్చిన నేపథ్యంలో కొన్ని లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని, రాజధాని మార్పు విషయం ఆలోచిస్తున్నామని ఓ తలతిక్క ప్రకటన చేశారు.


ఈ ప్రకటనతో రాష్ట్రంలో రాజధాని ప్రకంపనలు చెలరేగాయి. ప్రతిపక్ష టీడీపీ రాజధానిని మారిస్తే ఆందోళనలు చేస్తామనే సిగల్స్ ఇస్తుంది. అలాగే అధికార వైసీపీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి నేతలు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తుంటే, సీమ, నెల్లూరు, ప్రకాశం నేతలు దొనకొండని రాజధాని చేయాలని కోరుతున్నారు. ఇక బొత్స లాంటి వారు రాజధాని మార్పు విషయం ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. 


ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సరికొత్త ఆలోచన చెప్పారు. రాజధానిగా అమరావతి వద్దు, దొనకొండ వద్దు తిరుపతిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దొనకొండలో రాజధాని ఏర్పాటుకి వసతులు లేవని, అందుకే తిరుపతి బెస్ట్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందే ప్లేస్ తిరుపతి మాత్రమే అని చెప్పారు. రాజధానిగా దొనకొండ ఆలోచనను సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని మోహన్ డిమాండ్ చేశారు. 


ఏపీ రాజధాని అంశం సున్నితమైందని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అయితే ఎవరెన్ని రాజధాని విషయంలో మాట్లాడినా సీఎం జగన్ తీసుకునే నిర్ణయం ఫైనల్ కానుంది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాగానే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటివరకూ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటే చాలా మంచిదని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు. జ‌గ‌న్ ఈ గాసిప్స్‌కు చెక్ పెట్టేలా ఓ ప్ర‌క‌ట‌న చేస్తే వీటికి తెర‌ప‌డుతుంది.


jagan-decision-on-amaravathi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ కేబినెట్లో ఆ మంత్రికి టాప్ మార్కులే..
రేవంత్ ఎత్తుల‌తో ఉత్త‌మ్ బెంబేలు...!
బీజేపీ మ‌రో నినాదం.. ఆధార్‌కు కేంద్రం మంగ‌ళం..!
అమ‌రావ‌తిపై జ‌గ‌న్‌కు కొత్త టెన్ష‌న్‌..!
సిగ్గుచేటు: విశ్వవిద్యాల‌యాల్లో పంచాయితీలు..?
అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?
ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?
స‌మ్మ‌క్క సార‌క్క‌కు తొలిచీర ఎవ‌రిచ్చారంటే..
కేసీఆర్‌పై మ‌రో ఎమ్మెల్యే అల‌క‌పాన్పు
ఒకే ఒక్క నిర్ణ‌యం.. గ‌త పాల‌కుల‌ను మ‌రిపిస్తున్న జ‌గ‌న్‌
హ‌బ్బ‌.. బాబోరి భ‌యంక‌ర పోరాటం.. రీజ‌న్ పిచ్చ కామెడీయే
' గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ' 3 డేస్‌ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌
సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా జ‌గ‌న్, కేసీఆర్ భేటీ
మంత్రి ప‌ద‌వి కోసం ఆఖ‌రి అస్త్రం బ‌య‌ట‌కు తీస్తోందెవ‌రు..!
టీడీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల‌ సీన్ క్లోజేనా...!
హుజూర్‌న‌గ‌ర్లో గెలుపెవ‌రిది.. మారుతున్న స‌మీక ' ర‌ణం '
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్‌ను ఆ క్యాస్ట్ ఓట‌ర్లు ఓడిస్తారా...!
పవన్ బాబు ఫార్ట్‌న‌రే.. మ‌రోసారి ఫ్రూవ్ ..!
ఆరోగ్య శాఖపై ' ఆళ్ళ ' పట్టు సాధించేనా... ప్రోగ్రెస్ ఎలా ఉంది...
బాబుకు ఆ కాపు నేతలు హ్యాండ్.. టీడీపీకి మ‌రో షాక్‌..!
జ‌గ‌న్ పెళ్లికి శివ‌ప్ర‌సాద్ ఏం చేశారంటే...
చింత‌పండుపై జీఎస్టీ లేదోచ్‌...!
తెలంగాణ‌లో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌..!
ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు త‌మ్ముళ్ల షాక్‌..!
ఆ టీడీపీ కాపు నేత పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ చేసేశారు...!
ఉమా రాజకీయాలకు బలైపోయిన టీడీపీ సీనియర్ నేత...
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
ఆ వైసీపీ మంత్రి... మంత్రి స్థాయిని దాటేశారా..!
కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ నేత‌ల విల‌విల‌... ఏం జ‌రుగుతుంది...?
శివ‌ప్ర‌సాద్‌తో చంద్ర‌బాబు చిన్న‌నాటి అనుబంధం...
తెలంగాణ ఉప ఎన్నిక‌లో ఆంధ్ర అభ్య‌ర్థా...!
విల‌క్ష‌ణ పొలిటిక‌ల్ న‌టుడు... రాజ‌కీయ అజాత‌శ‌త్రువు ' శివ‌ప్ర‌సాద్‌ '
టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ మొన్న కోడెల‌... నేడు శివ‌ప్ర‌సాద్‌
స‌మైక్య‌గ‌ళంలో ' శివ‌ప్ర‌సాద్ ' హీరోయే..
భార్య‌ను ప్రెగ్నెంట్ చేయాల‌ని ప‌క్కింటి కుర్రాడితో డీల్‌
కేంద్రాన్ని ఎదిరించే స‌త్తా.. తెలుగు రాష్ట్రాల సీఎంల మౌనం..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.

NOT TO BE MISSED