రాజధాని మార్పుపై వస్తున్న ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖను బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.



సొంత పనులు చక్కబెట్టుకునేందుకు అమెరికాకు వెళ్లిన సీఎం, మంత్రి బొత్స తో రాజధానిపై అనుమానాలు కలిగే విధంగా ప్రకటన చేయించారని ఆరోపించారు . దీనిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ,జగన్ మోహన్ రెడ్డి గారు ట్వీట్ ద్వారా ప్రధాన మంత్రి గారికి ఇచ్చిన ఉత్తరం ఏంటి, అమరావతి మీద మీరు రాసిన కాన్ఫిడెన్షియల్ ఉత్తరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు .



ఈరోజు సీ ఆర్ డి ఎ పరిధిలో ఒక కులానికి సంబంధించి ఎనభై ఐదు శాతం లబ్ది పొందారు కాబట్టి, అమరావతి రాజధానిని బయటి ప్రాంతానికి తరలిస్తున్నాము అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని వార్తలొస్తున్నాయి అని అన్నారు . దీంతో భయపడాల్సింది ఏమీ లేదు,చేతనైతే మీ దగ్గర అంతా ట్రాన్స్ పరెంట్ కదా, దేవుడు పరిపాలన కదా, ఇది రాజన్న రాజ్యం కదా, మరి రాజన్న రాజ్యంలో దేవుడు పరిపాలనలో కాన్ఫిడెన్షియల్ ఉత్తరాలు ఏంటి, బందరు పోర్టు లో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఏంటి అని వ్యంగంగా ప్రశ్నించారు .



అలా ప్రశ్నిస్తే ట్రాన్స్ ఫర్ జీవో అయింది అని అన్నారు . మరి ఈరోజు ఈ దేవుడు పాలనలో దేవుడు కేంద్రానికి రాసిన ఉత్తరం ఏంటో బయటపెట్టమని డిమాండ్ చేశారాయన . రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకు వివరణ ఇవ్వాలని ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: