తెలంగాణాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో రెబల్ గా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.  రేవంత్ రెడ్డి.  తెలుగుదేశం పార్టీలో ఉండగా కొడంగల్ నియోజక వర్గం నుంచి వరసగా గెలుస్తూ వచ్చారు.  తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాక అయన అక్కడ నుంచి ఓడిపోయారు.  అయినా  సరే డీలా పడలేదు.. తెరాస పార్టీని ఎండగడుతూ వస్తున్నాడు.  


పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు మల్కాజ్ గిరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఇది తెరాస పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.  రేవంత్ రెడ్డిని కొడంగల్ లో చెక్ పెడితే.. హైదరాబాద్ నగరంలో మల్కాజ్ గిరి నుంచి నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఈ విజయంతో రేవంత్ తెరాస పార్టీకి ఓ సవాల్ విసిరారు.  ఎలాగైనా తెరాస ను గద్దె దించడమే లక్ష్యంగాపెట్టుకున్నారు.  


అయితే, రేవంత్ రెడ్డి విజయం సాధించిన తరువాత సైలెంట్ గా ఉన్నారు.  ఈ సైలెంట్ వెనుక అసలు రహస్యం ఏంటన్నది తెలియాలి.  ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉన్నది.  అటు అధిష్ఠానం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.  తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యారు.  అంతకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కారెక్కిన సంగతి తెలిసిందే.  


ఇప్పుడు తెలంగాణా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. తెరాస కు పోటీ బీజేపీ అని ప్రచారంజరుగుతున్నది .  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపాలంటే రేవంత్ రెడ్డిని తెరమీదకు తీసుకురావాలి.  ఆయనకు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలి.  అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు స్కోప్ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: