నేను నిరపరాధిని -  చిదంబరం

  తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని అనవసరంగా తలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అని మాజీ ఆర్థిక మంత్రి శ్రీ  పి చిదంబరం ఈరోజు ఢిల్లీలో చెప్పారు. తనపై ఎటువంటి అవినీతికి సంబంధించిన కేసులు కూడా లేవని ఇదంతా అభూత కల్పన అని త్వరలోనే  నిజాలు వెలుగు చూస్తాయని శ్రీ పి చిదంబరం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

గడచిన ఒక రోజు మొత్తం అనవసరంగా తనను తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని సత్య దూరమైన కల్పిత కథలతో కొన్ని దుష్ట శక్తులు ఏవేవో సృష్టించాయి అని  అవన్నీ తప్పని నిరూపితమవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. తనకు చట్టం మరియు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం, అత్యంత విశ్వాసం ఉన్నాయని, మన న్యాయ వ్యవస్థ ద్వారా నిజాలు బహిర్గతమవుతాయి అన్నారు.

 తన పైన   ఎటువంటి ఈ డి,  సి.బి.ఐ కేసులు లేవని, తనపై ఎటువంటి చార్జిషీటు  దాఖలు కాలేదని ఇదంతా గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం అన్నారు.   తాను సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, కోర్టు లో నిజాలు    బయటకు వస్తాయి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే తను ఎవరూ ఏమీ చేయలేరని ఈ సందర్భంలో శ్రీ చిదంబరం తెలియజేశారు.

  ఎఫ్ ఐ ఆర్  దాఖలు అయినంత మాత్రాన  నేరస్థుడిని కాదు అని నిజం బయటపడే వరకు మౌనంగా ఉండటం  మంచిదని శ్రీ చిదంబరం తెలియజేశారు



మరింత సమాచారం తెలుసుకోండి: