పోలవరం విషయం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ ఫిక్స్ అవ్వటంతో పోలవరం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరంకు సంభందించి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే జగన్ ఈ  నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం పనుల్లో వేగమనేది లేకుండా పోయింది. ఎక్కడి పనులు అక్కడే నత్తనడకగా సాగినాయి. దీనిని గమనించిన జగన్ కాంటాక్ట్ ను రద్దు చేసి కొత్తగా వచ్చే కంపెనీ మీద ఒత్తిడి పెట్టి పనులను చక చక పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. 


అయితే పోలవరం కాంట్రాక్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ ఇచ్చి కాంట్రాక్టు పనులను రద్ధు చేసిన సంగతీ తెలిసిందే. అయితే నవయుగ కంపెనీ ఇప్పుడు కోర్ట్ కు వెళ్ళింది. నవయుగ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు ..  ప్రభుత్వం నిరూపించాలి. లేదా పోలవరం పనుల్లో  నాణ్యత లోపించిందని ప్రభుత్వం తేల్చాలి. ఆలా చేయని పక్షంలో కోర్ట్ లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పనులు చేబడుతున్న నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఎప్పుడో ఇచ్చింది.


వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటీకే రీటెండరింగ్ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తిగా కరంగా మారింది. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు నవయుగ కంపెనీ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తే కోర్ట్ మెట్టులు ఎక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: