జoబో - కాబోయే  చీఫ్ సెలక్టర్ 

భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ మాజీ కెప్టెన్  అనిల్ కుంబ్లే తగిన వ్యక్తి అని  మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  చెప్పారు. భవిష్యత్తులో మనం అనిల్ కుంబ్లే  భారత క్రికెట్ జట్టు ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ  లో చీఫ్ సెలెక్టర్ గా చూడగలo అనటం లో సందేహం లేదని వీరేంద్ర సెహ్వాగ్  అన్నాడు. అనిల్ భాయ్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని దిగ్గజ క్రీడాకారుడు

అని  వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు.

 తాను జట్టులో ఎంపిక అయినప్పుడు  తనకు అన్ని విధాలా అండ గా నిలబడ్డాడు  అని, తనకు స్వేచ్ఛ గా ఆడే అవకాశమిచ్చి,  తనలో ధైర్యాన్ని నూరిపోసి ఆడించాడు అని సెహ్వాగ్  గతాన్ని నెమరు  వేసుకున్నాడు.

 అపార అనుభవo ఉన్నా   కుంబ్లే చీఫ్ సెలెక్టర్ అయితే  అత్యుత్తమమైన క్రికెట్ జట్టును  భారతదేశానికి అందించ గలరని వీరు అన్నాడు. పని పట్ల  అంకిత భావం ఉన్నాకుంబ్లే లాంటి వారు ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు పురోగతికి  బాగా తోడ్పడగలరు అని చెప్పు కొచ్చాడు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడం లో ఎప్పుడు ముందుండే  అనిల్ కుంబ్లే సెలక్టర్  అయితే అపార ప్రతిభా  వంతులు భారత క్రికెట్ జట్టు  లో చోటు సంపాదించే అవకాశాలు మెరుగవుతాయ ని వీరేంద్ర సెహ్వాగ్  చెప్పాడు. వెస్టిండీస్ లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు టెస్ట్  సిరీస్లో విజయం సాధించాలని వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు


మరింత సమాచారం తెలుసుకోండి: