టీడీపీ పార్టీ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. ఎన్నికలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నుంచి ఇప్పటికే కీలక నేతలందరూ పార్టీ నుంచి జారుకున్నారు. చంద్రబాబు అత్యంత సన్నిహితులు రాజ్య సభ సభ్యులు మూకుమ్ముడిగా బీజేపీలోకి చేరిపోయారు. ఇంకా చాలా మంది నేతలు కూడా బీజేపీలోకి చేరుతున్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో.. అయితే ఇటువంటి పరిస్థితిలో టీడీపీ పార్టీ నాయకత్వ మార్పు మంచి పని అని చెప్పాలి. టీడీపీపార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగిస్తే ఆ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న నిస్పృహలు అన్నీ కార్యకర్తల నుంచి దూరం అవుతాయి. వెంటనే పార్టీకొచ్చే ఫలితాలు వస్తాయా .. రావా అని పక్కన పెడితే టీడీపీ పార్టీ అయితే పుంజుకోవటానికి అవకాశాలను కొట్టి పారేయలేము. 


ఇప్పటీకే ఆ పార్టీలో పెద్ద తలకాయలు కనిపించడమం మానేశారు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను అధినేత చంద్రబాబు పసిగట్టిన నేతలను కంట్రోల్ లో పెట్టలేకపోయారు. చివర్లో డబ్బులతో మ్యానేజ్ చేయొచ్చనుకొని ప్రజలను బాబుగారు చాలా తక్కువ అంచనా వేసినారు. అయితే బాబును ప్రజలు విశ్వసించలేదు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి ఉపశమనం కావాలన్నా .. ఆ పార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవకుండా ఉండాలంటే ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు. 

మరింత సమాచారం తెలుసుకోండి: