దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఐఎన్ఎక్స్ కేసులో మాజీమంత్రి, కాంగ్రెస్ నేత‌ పి.చిదంబ‌రం అరెస్ట‌య్యారు. 2007– ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. ఈ నేప‌థ్యంలో, చిదంబ‌రం అరెస్ట‌య్యారు. 


అయితే, చిదంబరంపై ఈడీ దాడులు, సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో అనూహ్య‌మైన చ‌ర్చ తెర‌మీద‌కు వస్తోంది. దీని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో అమిత్‌ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తరువాత ఆయనకు గుజరాత్‌ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు. అయితే, కేంద్రంలో యూపీయే ప్రభుత్వంలో హోంమంత్రిగా పి.చిదంబరం ఉన్న స‌మ‌యంలో గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేయించి.. జైల్లో వేయించారు అని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 


కాగా, తాజాగా సీబీఐ అధికారులు.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో 24 గంటల అజ్ఞాతం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమైన ఆయన.. మీడియాతో మాట్లాడి ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ వెంటనే చిదంబరం నివాసానికి సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. గూడ దూకి మరీ లోపలికి ప్రవేశించిన అధికారులు. చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. చిదంబరాన్ని అరెస్ట్ చేసి ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీసుకు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: