రోడ్డుమీద జరిగే ప్రమాదాలను,డ్రంకన్‌డ్రైవ్‌లో  దొరికే కేసులను చూసి చూసి చట్టానికి విసుగొచ్చిందో ఏమో,వాహానచట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.ఇకనుండి రోడ్డుపై డ్రైవింగ్ చేస్తే చాల జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి.ఆ ఏముందిలే చలాన్ వేస్తారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే,వేసేది చలానేనైన అది కట్టడానికి బండ్లు,ఇల్లు అమ్ముకోవలసి వస్తుంది.డబ్బున్న బాబులకైతే ఓకే కాని సామాన్య మానవుల పరిస్దితి ఏంటో ఆలోచిస్తే జేబులోని డబ్బులు ఇకనుండి మీతో నేనుండుడు చాలతక్కువ అని గగ్గోలు పెడతాయి.డబ్బులకు రెక్కలొచ్చే రోజులు వస్తాయ నుకుంటే ఏమో అనుకున్నారంతా ఇన్నాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ వల్ల అవి నిజమే అనిపించకమానదు.ఇంతకు విషయం చెప్పక ఏంటి మ్యాటర్ అని టెన్షన్ పడుతున్నారా.




ఇంతకాలం మీరు సిగ్నల్ పడినా ఏం అవుతుందిలే అని జంప్ అయ్యారు?హెల్మెట్ లేకుండానే బైక్ తీసుకుని రైడ్ చేసారు? సీటు బెల్టు పెట్టుకోకుండా కారులోచక్కర్లు కొట్టారు?ఫోన్ మాట్లాడుతూ దూసుకుపోయారు?అయితే,ఇప్పటినుండి జర జాగ్రత్త..చలాన్ల మోత మోగబోతోంది.మామూలుగా కాదు..ఇందాక చెప్పినట్లు అప్పులు చేసి మరీ ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవాల్సిన ప్రమాదం ఏర్పడబోతోంది.ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ప్రయాణాలు చేయాల్సిన సమయం వచ్చేసింది.ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్‌ చేసినవారికి పోలీసులు విధించే చలాన్లు,విపరీతంగా పెంచేసింది ప్రభుత్వం.పేద,మధ్యతరగతి ప్రజలు ఈ చలానాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఇకపై రూల్స్ ప్రకారం వెళ్తేనే మంచింది.




1988 నాటి మోటారు వెహికిల్ చట్టానికి గత నెల పార్లమెంటులో సవరణలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది.ఇక జేబులో వున్న డబ్బులు మాయం అవ్వద్దంటే చేయకూడని పనులు కొన్ని చేయద్దు,ఒకవేళ చేస్తే ఎంతెంత జేబులుఖాళీ అవుతాయో చూద్దాం.ఫైర్‌ ఇంజిన్‌,అంబులెన్స్‌ వంటి వాటికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా వసూల్ చేస్తారు.ఇప్పటివరకూ100రూ.జరిమానా ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు రూ.500 వరకు చలానా విధించే వెసులుబాటు ఉంటుంది.అధికారుల ఆదేశాలను బేఖాతరుచేస్తే 2000 రూపాయలు.లైసైన్స్‌ ఇంటివద్ద మర్చిపోతే 5000ల రూ,వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే రూ.2000ల రూ.ఫైన్ వేస్తారు.




ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు,సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే 1000రూ.వరకు,హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి,పరిమితికి మించి లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు,ర్యాష్‌ డ్రైవింగ్‌కు చేస్తే రూ.వెయ్యి నుంచి 5 వేలు,డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు..ఇలా చలాన్ల మోత మోగిపోనుంది.సాధారణంగా పేద,మధ్యతరగతి ప్రజలు భరించలేని విధంగా కొత్త జరిమానాలు వసూలు చేయనున్నారు.మరికొందరు రూల్స్ బ్రేక్ చేసి ఈ భారీ మొత్తాలు చెల్లించేకంటే..రూల్స్ ఫాలో అయితే అందరికీ మరి మంచిదని చెబుతున్నారు.మరికొందరు ఇలా అయినా వాహనదారుల్లొ భయం పుట్టి పద్దతిగా నడుచుకుంటారని అంటున్నారు,కాని మూడోరకం వాళ్ళు మాత్రం ఈ పెంపుదల ప్రభుత్వ ఖజాన నింపుకోడానికే అని గుసగుసలాడుకుంటున్నారు.ఎవ్వరు ఏమనుకున్న మనందరం ఈ రోజునుండే  ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: