చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు. మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు జనం జై కొడతారు. అలా కొట్టాలని చంద్రబాబు కూడా భావిస్తారు. ఎందుకంటే దేశంలోకెల్లా సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు ప్రస్తుతం సీఎం జగన్ వయసు. ఓ విధంగా చెప్పాలంటే జగన్ కు తండ్రిలాంటి వయసు బాబుది. అయితే నిన్నటి ఎన్నికల్లో జనం జగన్ కి జై కొట్టి బాబుకు ఘోరమైన పరాభవం మిగిల్చారు.


కొత్త సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు చంద్రబాబు విపక్ష పాత్రను పోషిస్తూ అపుడే వీధుల్లోకి వచ్చేశారు. వరదబాధితులకు పరామర్శ పేరుతో ఆయన గుంటూర్ జిల్లాలో పర్యటిస్తున్నపుడు వింత అనుభవం ఎదురైంది. కొల్లూరు, భట్టిప్రోలు సహా పలు వరద ప్రభావిత ప్రాంతాలలో బాబు పర్యటన చేశారు. ఈ సందర్భంగా కొల్లూరు మండలం పోర్లంక వద్ద బాబుకు చేదు అనుభవం ఎదురైంది.


కొంతమంది యువకులు చంద్రబాబు ఎదురుగా వస్తూండగానే జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అసలు జగన్ పేరు వింటేనే అసహనంతో ఫీల్ అయ్యే బాబుకు ఈ జై జై నినాదాలు ఎంతగానో చికాకు పరచాయి. తీవ్ర అసహనానికి లోను అయిన చంద్రబాబు వెంటనే ఆ యువకులను ఉద్దేశించి జై కొట్టండి జగన్ కి. నాకేం ఇబ్బంది లేదు, అయితే  వరద  ప్రాంతాలకు జగన్ని మంత్రులను వెళ్ళి తీసుకురండి అంటూ ఫెయిర్ అయ్యారు. 


మొత్తం మీద చంద్రబాబు పర్యటనలో వైసీపీ అభిమానాన్ని అలా కళ్లారా చూశారు. జగన్ మీద జనానికి ఉన్న ఆదరణను కూడా మాజీ ముఖ్యమంత్రి చెవులారా విన్నారు. అయినా కొత్త సర్కార్ వచ్చి మూడు నెలలు కూడా కాలేదు, విమర్శలు చేస్తూ వీధినపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు. జగన్ మీద జనానికి చాలా  మోజు ఉంది, మనం కొన్నాళ్ళు గమ్మున  ఉందామని సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పొలిట్ బ్యూరోలో బాబుకు చెప్పారు. ఇలాంటి సీన్లు వూహించే అయ్యన్న అలా అని ఉంటారని ఇపుడు తమ్ముళ్ళు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: