సువిశాల భారతదేశాన్ని ఏలిన మాజీ హోం మంత్రినే ఏమీ కాకుండా సీబీఐ అరెస్ట్ చేసేసింది. ఒకనాటి తన బాస్ అన్నది లేకుండా సంకెళ్ళు వేసేసింది. ఇపుడు సీబీఐ పవర్ ఏంటో మాజీలైన నేతలు చవి చూస్తున్నారు. మరి చీకట్లో చిదంబరాన్ని కలిసిన వారు, నాడు ఓ రేంజిలో హవా చలాయించిన వారు తాజా పరిణామాలతో హడలిపోతున్నారు.


సీబీఐ అంటే పంజరంలో చిలక అని సుప్రీం కోర్టు ఓ సందర్భంలో కామెంట్స్ చేసింది. తాము సొంతంగానే పనిచేస్తున్నామని చెప్పుకున్నా సీబీఐ మాత్రం డైరెక్ట్ గా హోం శాఖ మంత్రి ఆదేశాలను అనుసరిస్తుందన్నది అందరికీ తెలిసిందే. మరి హోం శాఖ మంత్రిగా ఇపుడు సర్వ శక్తిమంతుడైన అమిత్ షా  ఉన్నారు. ఆయన మోడీ తరువాత ప్లేస్ లో ఉంటూ దేశంలో చక్రం తిప్పుతున్నారు.


మరి మోడీ, అమిత్ షా ల లిస్ట్ లో ఎవరు ఉన్నారా అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏపీకి సంబంధించి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్తాడని బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునిల్ డయోధర్, ఎంపీ జీవీఎల్ నరసిం హారావు వంటి వారు పదే పదే అంటూ వచ్చారు.  ఇపుడు చిదంబరం వంటి బిగ్ షాట్ కే దిక్కు లేకపోతే మిగిలిన నేతల సంగతేంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది.


లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తూంటే మోడీ షా ద్వయం చాలా మందికి టిక్కు పెట్టేలాగానే ఉంది. ఏపీలో అటు జగన్, ఇటు మోడీలకు ఉమ్మడి శత్రువైన బాబు విషయంలో సీబీఐ తన కన్ను తెరుస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు తెలంగాణాలో కేసీయార్ విషయంలోనూ సీబీఐ ని ప్రయోగిస్తారా అన్న చర్చ నడుస్తోంది. 


ఇక దేశంలో చాలా మంది విపక్ష నేతలు ఉన్నారు. వారిలో పలువురు అనేక  కుంభకోణాల్లో పాలుపంచుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. అయిదేళ్ల అధికారంలో మూడు నెలలు మాత్రమే పూర్తి చేసుకున్న మోడీ షా ద్వయం ఇపుడు దూకుడు మీద ఉన్నారు. మరి సీబీఐ ఎందరిని వణికిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: