ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం ఈ నెల 11 వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరించగా మరో రెండు రోజుల్లో రాత పరీక్షల కొరకు హాల్ టికెట్లు జారీ చేస్తారని తెలుస్తోంది.ఈ ఉద్యోగాల కొరకు 21 లక్షల 70 వేల ధరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది.  సెప్టెంబర్ 1 వ తేదీన జరిగే రాత పరీక్షకు13 జిల్లాల్లో  4,478 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 
 
సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహించబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ 1 వ తేదీన జరిగే రాత పరీక్షకు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్ 3,4,6,7,8 తేదీల్లో జరిగే పరీక్షలకు మాత్రం ఏడు జిల్లాల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 3,4,6,7,8 తేదీల్లో జరిగే పరీక్షలకు 7 జిల్లాల్లో 536 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. 
 
సెప్టెంబర్ 1 వ తేదీన 15 లక్షల 50 వేల మంది అభ్యర్థులు మిగిలిన రోజుల్లో 6,19,812 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు రాత పరీక్షల ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. నిన్న సచివాలయం నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా డిజీపీ గౌతమ్ సవాంగ్ తో కలిసి సమీక్ష చేసారు. 
 
ప్రత్యేక ఎస్కార్ట్ సహాయంతో ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఇతర ప్రభుత్వ పరీక్షలలాగానే గ్రామ, వార్డ్ సచివాలయాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలిచ్చారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పరీక్ష కేంద్రాల దగ్గర చేయాలని డీజీపి గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: