కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం అరెస్టయ్యారు. బుధవారం రాత్రి కొంత హైడ్రామా తర్వాత మాజీ హోంమంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. చిదంబరం ఇంటి గోడ దూకి మరీలోపలికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. చిదంబరం మామూలు వ్యక్తి కాదు.. ఈ దేశానికి హోంమంత్రిగా పని చేసిన వ్యక్తి. ప్రస్తుతం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పాపం ఆయన ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. చివరి నిమిషంలో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా నిరాశే ఎదురైంది.


అయితే ఇక్కడో వాదన వినిపిస్తోంది. ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా... గతంలో తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగానే చిదంబరాన్ని టార్గెట్ చేశారన్న వాదన వినిపిస్తోంది. అమిత్ షాకు చిదంబరంపై కోపం ఏంటి.. చిదంబరం అంటే అమిత్ షాకు ఎందుకంత కక్ష.. ఈ వివరాలు తెలియాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి మరి.


2010లో అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్నరోజుల్లో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగింది. అప్పట్లో కేంద్రంలో హోమంత్రిగా ఉన్న చిదంబరానికి ఇది ఆగ్రహం తెప్పించింది. చేతిలో అధికారం ఉంది. వెంటనే సీబీఐ ఎంక్వయిరీ వేశారు. అమిత్ షాపై కేసు నమోదైంది.. రాష్ట్ర హోం మినిష్టర్ అయినా సరే.. అమిత్ షా ను అరెస్టు చేశారు. జైలుకు కూడా పంపారు. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


అదిగో ఆ సమయంలోనే అమిత్ షా చిదంబరంపై విపరీతమైన కక్ష పెంచుకున్నారు. తనను జైలుపాలు చేసిన చిదంబరాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత కాలంలో మోడీ అధికారంలోకి వచ్చాడు. అమిత్ షా పై ఉన్న కేసులన్నీ క్లియర్ అయ్యాయి. మోడీ సెకండ్ టర్మ్ లో అమిత్ షా ఏకంగా హోంమంత్రే అయ్యాడు. అందుకే చిదంబరంపై ఉన్న కేసులన్నీ తిరగతోడారు. దానికి తోడు చిదంబరం ఆర్థక నేరాలను గట్టి సాక్ష్యాలే దొరకడంతో అమిత్ షా పని సులువైంది. మొత్తానికి చిదంబరాన్ని అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టాడు అమిత్ షా. రేపు చిదంబరం బెయిల్ పై విడుదల కావచ్చు గాక..కానీ అమిత్ షా పంతం మాత్రం నెరవేరిందిగా..


మరింత సమాచారం తెలుసుకోండి: