ఐదేళ్లు తన పరిపాలనలో చంద్రబాబు అమరావతి అంటూ ఎన్నెన్నో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తల్లో రోజుకో జిమ్మిక్ చేసేవారు. కానీ ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే ఇటువంటి అమరావతిని కట్టిన బాబు అక్కడి నుంచి రాజధానిని మారిస్తే ఊరుకోను అని మీడియాలో తెగ భాదపడిపోతున్నారు. 


వైసీపీ నేత మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. అమరావతి మార్పు అనేది ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించలేదు. 


ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు. పచ్చ మీడియా కూడా ఎన్నికలప్పుడు ఇలాంటి గాలి వార్తలే ప్రముఖంగా ప్రచురించి ప్రజల్లో కన్ఫ్యూషన్ ను క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఏం జరిగిందో మనం చుసము. ప్రజలు చాలా క్లారిటీగా ఓట్లు వేసి జగన్ ను గెలిపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: