Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:45 pm IST

Menu &Sections

Search

రాజుకుంటున్న ’రాజధాని’ మంటలు

రాజుకుంటున్న ’రాజధాని’ మంటలు
రాజుకుంటున్న ’రాజధాని’ మంటలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజధాని సమస్యలపై రెండు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాజకీయపార్టీల మధ్య రాజధాని మంటలు రాజేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానిని అమరావతి నుండి దొనకొండకు మార్చేస్తోందని ఒకటే గగ్గోలో మొదలైంది. బొత్స మాట్లాడిన మాటలు విన్నతర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.

 

అమరావతి రాజధానిగా పనికిరాదని శివరామకృష్ణన్ చేసిన ప్రకటనను మంత్రి గుర్తుచేశారు. మిగితా ప్రాంతాల్లో నిర్మాణాల వ్యయం కన్నా అమరావతిలో కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా మొత్తం అమరావతి ప్రాంతమే ముంపుకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని కూడా బొత్సా చెప్పారు. ఇంకేముంది ? రాజధానిని అమరావతి నుండి ప్రకాశంజిల్లాలోని దొనకొండకు మార్చేయబోతున్నారంటూ ఎల్లోమీడియాలో ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

ఎప్పుడైతే ఎల్లోమీడియా ప్రచారం మొదలైందో వెంటనే పచ్చబ్యాచ్ అలర్టయ్యింది. తమ్ముళ్ళు రంగంలోకి దిగేశారు. రైతుల త్యాగాలను వృధా చేస్తే అంగీకరించమన్నారు. రైతుల త్యాగాల వల్ల వందల కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పడినట్లు చెబుతున్నారు. రాజధానిని మార్చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ హెచ్చరికలు గుప్పిస్తున్నారు.

 

రాజధాని మార్చే అంశంపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి+టిడిపి నేతలు ఒకటైనట్లే కనిపిస్తోంది. అంటే టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలే ఇందులో ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు లేండి.  జరుగుతున్న ప్రచారంతో జనాల్లో కూడా అయోమయం మొదలైపోయింది. నిజానికి అమరావతి ప్రాంతం రాజధానికి ఏ విధంగా చూసినా పనికిరాదని నిపుణులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు.

 

అయినా సరే చంద్రబాబునాయుడు పట్టుబట్టి కేవలం తన సామాజికవర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. రాజధానిగా అమరావతి ఏమాత్రం సేఫ్ కాదని మొన్నటి వరద కూడా రుజువు చేసింది. అయినా సరే దీన్ని రాజకీయం చేయటానికి ఎల్లోబ్యాచ్ రెడీ అయిపోతోంది. మరి అమెరికా టూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

 

 


tdp-fumes-capital-issue
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలవరం రివర్స్ టెండర్లో సంచలనం
అసలు సినిమా ఇప్పుడే మొదలైందా ?
కాంగ్రెస్ లో మొదలైన జగన్ టెన్షన్
చంద్రబాబు, చినబాబు రాజీనామా చేస్తారా ?
చంద్రబాబుకు మూడు రోజులే డెడ్ లైన్
జగన్ కు డాక్టర్ల షాక్ తప్పదా ?
చంద్రబాబుకు నిసిగ్గుగా ఎల్లోమీడియా క్లీన్ సర్టిఫికేట్ ?
జగన్ సిఎం అవ్వటానికి కారణం అదేనా ?
ఈయన అత్యుత్సాహమే కొంప ముంచేస్తుందా ?
చంద్రబాబు చెప్పినవన్నీ దొంగ లెక్కలేనా ?
చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
తన హయాంలో భారీ స్కాం జరిగినట్లు అంగీకిస్తున్నారా ?
మరోసారి బయటపడిన ఎల్లోమీడియా అక్కసు
చంద్రబాబుకు వారం రోజులే గడువు..మరో రచ్చకు రెడీనా ?
జగన్, చంద్రబాబు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందా ?
కమ్మ సామాజికవర్గమే’ కోడెల’ ను ఛీ కొట్టిందా ? ..సంచలన కథనం
జగన్ ’రివర్స్’ తో చంద్రబాబుకు షాక్
అంతిమ యాత్రలో చంద్రబాబుది నటనేనా ?
జగన్ అంటే మీడియా భయపడిపోతోందా ?
ధైర్యం గురించి చంద్రబాబే చెప్పాలి
మారిపోయిన బాడీ లాంగ్వేజ్
ట్వీట్ల ద్వారా వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటారా ?
జగన్ సంతకంతో గిరిజనులు ఫుల్ హ్యాపీ
టిటిడి బోర్డును ప్రభుత్వం కంపు చేసేస్తోందా ?
చంద్రబాబుకు ఏమో అయ్యింది
జగన్ ప్రభుత్వంపై ’లీకేజీ’ మరక
చింతమనేని చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
గవర్నర్ కు కూడా బురద అంటిస్తున్న చంద్రబాబు
ఈ ఫొటోను చూస్తుంటే ఏం గుర్తుకొస్తోంది ?
కోడెల కుటుంబాన్ని చంద్రబాబు ఆదుకుంటారట !
బయటపడిన చంద్రబాబు మరో అవినీతి
చంద్రబాబు రచ్చకు కారణం అదేనా ?
సుజనా పై రహస్య విచారణ
అధికార పార్టీలో చేరినా షాక్ తప్పదా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.