రాజధాని సమస్యలపై రెండు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాజకీయపార్టీల మధ్య రాజధాని మంటలు రాజేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానిని అమరావతి నుండి దొనకొండకు మార్చేస్తోందని ఒకటే గగ్గోలో మొదలైంది. బొత్స మాట్లాడిన మాటలు విన్నతర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.

 

అమరావతి రాజధానిగా పనికిరాదని శివరామకృష్ణన్ చేసిన ప్రకటనను మంత్రి గుర్తుచేశారు. మిగితా ప్రాంతాల్లో నిర్మాణాల వ్యయం కన్నా అమరావతిలో కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా మొత్తం అమరావతి ప్రాంతమే ముంపుకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని కూడా బొత్సా చెప్పారు. ఇంకేముంది ? రాజధానిని అమరావతి నుండి ప్రకాశంజిల్లాలోని దొనకొండకు మార్చేయబోతున్నారంటూ ఎల్లోమీడియాలో ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

ఎప్పుడైతే ఎల్లోమీడియా ప్రచారం మొదలైందో వెంటనే పచ్చబ్యాచ్ అలర్టయ్యింది. తమ్ముళ్ళు రంగంలోకి దిగేశారు. రైతుల త్యాగాలను వృధా చేస్తే అంగీకరించమన్నారు. రైతుల త్యాగాల వల్ల వందల కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పడినట్లు చెబుతున్నారు. రాజధానిని మార్చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ హెచ్చరికలు గుప్పిస్తున్నారు.

 

రాజధాని మార్చే అంశంపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి+టిడిపి నేతలు ఒకటైనట్లే కనిపిస్తోంది. అంటే టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలే ఇందులో ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు లేండి.  జరుగుతున్న ప్రచారంతో జనాల్లో కూడా అయోమయం మొదలైపోయింది. నిజానికి అమరావతి ప్రాంతం రాజధానికి ఏ విధంగా చూసినా పనికిరాదని నిపుణులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు.

 

అయినా సరే చంద్రబాబునాయుడు పట్టుబట్టి కేవలం తన సామాజికవర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. రాజధానిగా అమరావతి ఏమాత్రం సేఫ్ కాదని మొన్నటి వరద కూడా రుజువు చేసింది. అయినా సరే దీన్ని రాజకీయం చేయటానికి ఎల్లోబ్యాచ్ రెడీ అయిపోతోంది. మరి అమెరికా టూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: