చంద్రబాబునాయుడు-చిదంబరం మధ్య ఉన్న స్నేహబంధం దేశం మొత్తానికి తెలుసు. అయినా సరే అంతటి స్నేహబంధం కూడా చిదంబరాన్ని అరెస్టు నుండి తప్పించలేకపోయింది. చిదంబరం అరెస్టుకు చంద్రబాబుకు మధ్య ఏమిటి సంబంధం అని అనుమానిస్తున్నారు. ఇక్కడే ఉంది అసలు విషయమంతా.

 

పదేళ్ళక్రితం యూపిఏ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా చక్రం తిప్పిన కేంద్రమంత్రుల్లో చిదంబరం కూడా ఒకరు. ఆ సమయంలో చంద్రబాబుకు ఏ అవసరం వచ్చిన ఆదుకునేందుకు ముందుకు వచ్చింది చిదంబరమే. అందుకనే ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా రహస్యంగా అర్ధరాత్రుళ్ళు చిదంబరాన్ని కలవకుండా చంద్రబాబు తిరిగి రారు అనే ప్రచారం అందరికీ తెలిసిందే.

 

రాష్ట్ర విభజన సమయంలో కూడా కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఏపికి వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా చంద్రబాబుతోనే మాట్లాడేవారని ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉంటారు.  తర్వాత అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో కూడా వీళ్ళద్దరి  పాత్ర ఎక్కువగా ఉందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతటి ఘాడ స్నేహం ఉంది వీరిద్దరి మధ్య.

 

అలాంటిది ఇపుడు చిదంబరాన్ని అరెస్టు కానీకుండా బెయిల్ ఇప్పించటంలో చంద్రబాబు సాయం చేయలేకపోయారా అన్న ప్రశ్నే అందరినీ తొలిచేస్తోంది. ఎందుకంటే చిదంబరం బెయిల్ పిటీషన్ ను విచారించింది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వి రమణే. బెయిల్ పిటీషన్ విచారణ ఎప్పుడైతే ఎన్వీ రమణ ముందుకు వచ్చిందో చిదంబరానికి బెయిల్ వచ్చేస్తుందనే అందరూ అనుకున్నారు.

 

నిజానికి బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపుంటే ఏం జరిగుండేదో తెలీదు కానీ సుప్రింకోర్టు అసలు విచారణే జరపలేదు. ఇప్పటికప్పుడు విచారణ జరపాల్సిన అవసరం లేదు పొమ్మంది. దాంతో బెయిల్ రాకపోవటంతో సిబిఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. మరి స్నేహితుడిని ఆదుకోవటానికి చంద్రబాబు ప్రయత్నాలేమీ చేయలేదా ? అన్న అంశమే రాజకీయపార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: