ఎస్వీ యూనివర్శిటీ పరిధిలో బిఇడి కాలేజీల్లో భారీ స్కాం బయటపడింది. బీఇడీ సీట్లనూ అంగట్లో సరుకుల అడ్డగోలుగా అమ్ముకుంటున్నాయి బిఇడి కాలేజీ యాజమాన్యం. ఎస్వీ యూనివర్సిటీ కున్న న్యాక్ ఎ గుర్తింపును అడ్డం పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో దందా చేస్తున్నాయి బీఈడీ కాలేజీల యాజమాన్యాలు. బ్రోకర్ లను పెట్టుకొని ఒక్కో సీటును లక్ష రూపాయలకు అమ్మేస్తున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరానికి ఒక్కో కాలేజీ వంద సీట్లను అడ్డదారులో అమ్మేస్తుందని విషయం వెలుగు లోకొచ్చింది. కాలేజీకి రాకపోయినా ప్రాక్టికల్స్ కి అటెండ్ కాకపోయినా పరీక్ష రాయిస్తామని ఒప్పందంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తూ సీట్లను అమ్మేస్తున్నాయి బిఇడి కాలేజీలు. చిత్తూరు జిల్లాలో దాదాపు ముప్పై రెండు బిఇడి కాలేజీలున్నాయి.


అందులో ఇరవై ఆరు కాలేజీల్లో అడ్మిషన్ లు పూర్తిగా జరిగాయి. అయితే, భౌతికంగా ఒక్క కాలేజీలో కూడా విద్యార్థులు కనిపించరు. బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది కూడా కనిపించరు. కేవలం ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్ లు మాత్రమే కనిపిస్తాయి. కానీ, పరీక్షల సమయానికి మాత్రం విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో అటెండెన్స్ ఉంటుంది. అందరూ పరీక్షలు రాసి పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ లు కూడా పొందుతున్నారు. గవర్నమెంట్ రికార్డుల్లో చూస్తే ఈ కాలేజీ లు ఫుల్ టైమ్ గా పని చేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండు వేల పదిహేను లో ప్రభుత్వం బిఇడి కోర్సు కాల వ్యవధిని రెండేళ్లకు పెంచింది. అయితే బీఈడీ చదివిన వారిని కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులుగా మార్చింది.


దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో బిఇడి పై ఆశ తగ్గింది. చాలా మంది బీఇడీ చదవడం, మానేయడంతో కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఎస్వీ యూనివర్సిటీ కాలేజీ పరిధిలో బిఇడి కాలేజీలు కొత్త దందాకు తెరలేపాయి. పక్క పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, బెంగాల్, తమిళనాడు, తెలంగాణకు చెందిన విద్యార్థులకు తమ కాలేజీ సీట్లను అమ్మకానికి పెట్టాయి. లక్ష రూపాయల చొప్పున ఒక్కో కాలేజీ ప్రతి ఏడాది వంద సీట్లను అమ్ముతోంది అంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: