కాంగ్రెస్ సీనియర్ నేత .. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది. చెడపకురా.. చెడేవే అని పెద్దలు ఊరకనే అనలేదు. ఇలాంటి నీచమైన రాజకీయ నేతలు ఉంటారు కాబట్టే ఇటువంటి సామెతలు పుట్టాయి కాబోలు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు.


కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. దీనితో 24  గంటలు అజ్ఞాతవాసంలోకి పోయిన చిదంబరం దిల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కనిపించారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలిటికల్ గా ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: