డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆగష్టు 7, 2018 లో మరణించారు.  అయన మరణించి దాదాపు ఏడాది దాటిపోయింది.  అయన రాకీయాల్లోకి ప్రవేశించిన తరువాత మొదటిసారి తిరువారూర్ లోని సహకార బ్యాంకు సభ్యులలో ఒకరిగా ఉన్నారు. ఆ తరువాత ఆ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు.  అయన మరణించిన తరువాత సహకార బ్యాంకు ఎన్నికలు జరిగాయి.  ఈ బ్యాంకు ఓటర్ల జాబితా సంఖ్య మొత్తం 14,817.  అయితే, ఈ ఓటర్ల జాబితాలో కరుణానిధి పేరు ఉండటం విశేషం.  


ఆయన మరణించి ఏడాది దాటినా ఇంకా ఆయనపేరు ఓటర్ల లిస్టులో ఉండటంతో చర్చనీయంశంగా మారింది.  ఎన్నికలను నిలిపివేయాలని, కరుణానిధి పేరును తొలగించిన తరువాత తిరిగి ఎన్నికలు జరిపించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ డిమాండ్ ను బ్యాంకు బోర్డు పరిగణలోకి తీసుకుందా అన్నది చూడాలి. బ్యాంకు ఖాతా ఇంకా ఆయన పేరున ఉండటం వలన ఈ పొరపాటు జరిగిందని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.  


సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండటం మామూలే.  ఉన్నవాళ్లు లేనట్టుగా, పోయిన వాళ్ళు ఇంకా ఉన్నట్టుగా ఓటర్ల జాబితాలో చూపిస్తూ ఉంటుంది.  కానీ, ఇలా తక్కువ మంది సభ్యులు ఉన్న బ్యాంకు ఓటర్ల జాబితాలో కూడా ఇలాంటి అవకతవకలు ఉన్నాయంటే మన పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  ఇదిలా ఉంటె, 2021 లో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి.  


ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డీఎంకే ప్రయత్నం చేస్తోంది.  కరుణానిధి మరణించిన తరువాత జరిగే ఎన్నికలు కాబట్టి గెలిచి ఆయనకు నివాళులు అర్పించాలని డీఎంకే అధినేత స్టాలిన్ చూస్తున్నాడు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ స్థానాలు గెలుచుకోవడం విశేషం. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆ పార్టీ  మరింత బలహీనపడింది.  మరి వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి.  వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: