చట్టం ఏది చెబితే అది ఫాలో అవుతున్నారు జనం.ప్రపంచం మారిపోయిందా అని ఆలోచించకండి,ఎందుకంటే చట్టం చెప్పిన మంచిపని విషయంలో ఇది వర్తించదు.రేప్ విషయంలో,తలాక్ చెప్పే విషయంలో,మొత్తానికి అమ్మాయిలను మోసం చేసే విషయాల్లో మగవాళ్ళు ఎప్పుడు ముందేవుంటారు.ఇలాంటి మ్యాటర్స్‌లో మనవాళ్లు చాల ఫాస్ట్ గురూ.ఇప్పుడు అదే జరిగింది.మహా రాష్ట్రకు చెందిన ఓ మహిళ ఉద్యోగి తనను సీఆర్పీఎఫ్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధంపెట్టుకున్నాడని,తర్వాత మోసం చేశాడని ఆరోపిస్తూ మూడేళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు,దీంతో ఎక్కడోకాలి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.




ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ,మహిళ ఉద్యోగి ఆరోపణలను తోసిపుచ్చింది.పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ అనేక ఏళ్లుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నారని, ఆ తర్వాతే పెళ్లి అంశం వివాదాస్పదమైందని,ఇది అత్యాచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది.అంతేకాకుండా ఒక పురుషుడితో మహిళ దీర్ఘకాలం శారీరక సంబంధాన్ని కొనసాగించి,అతడితో పెళ్లి సాధ్యం కాదని తెలిసినప్పుడు అత్యాచారం చేసినట్లు ఆరోపించలేరని ఈ కేసును విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్,జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనంపేర్కొంది..గతంలో నిందితుడు  వాట్సాప్ ద్వారా పంపిన అభ్యంతరకరమైన మెసేజ్‌లు ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం ప్రకారం నేరం కాదని,ఎందుకంటే అవి వారి ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత విషయమని పేర్కొంది.




అంతేకాదు,2015ఆగస్టు 27,28,అక్టోబరు 22న మెసేజ్‌లు పంపే సమయానికి ఎస్సీ/ఎస్టీ చట్టంలో సవరణలు చేయలేదని వ్యాఖ్యానించింది.అయితే,ఇష్టపూర్వకంగానే అతడితో సెక్స్‌లో పాల్గొందని, పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం వచ్చిందని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.అతను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం మోసంచేయడమే అవుతుంది కానీ,వాస్తవానికి ఆమెసమ్మతితోనే ఇది జరిగింది.కాబట్టి అతడి వాగ్దానం తప్పని చెప్పలేమని’ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: