Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 7:38 pm IST

Menu &Sections

Search

రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దంటూ తీర్పిచ్చిన హైకోర్ట్..!!

రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దంటూ తీర్పిచ్చిన హైకోర్ట్..!!
రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దంటూ తీర్పిచ్చిన హైకోర్ట్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై హై కోర్టు తీర్పిచ్చింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ కోర్ట్ లో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైడల్ ప్రాజెక్టు కు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అందుతున్న సమాచారం మేరకు తీర్పుకు సంబంధించిన పూర్తి సారాంశం ఇంకా బయటకు రావాల్సి ఉంది.


ప్రస్తుతం అందుతున్న సమాచారం అయితే ఏ అంశం మీద అయితే నవయుగ సంస్థ కోర్టుకు వెళ్ళిందో  అంటే ఈ పోలవరం హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో రివర్స్ టెండరింగ్ కు వెళుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందో దాన్ని రద్దు చేయాలంటూ కోర్ట్ కి వెళ్లిన నేపథ్యంలో దీని మీద విచారణలు పూర్తి స్థాయిలో విన్న తర్వాత స్టే విధించటంతో పాటుగా, తుది తీర్పు ఇచ్చేంతవరకూ ఈ కాంట్రాక్ట్ ని ఎవరికి కట్టబెట్టవద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీనిమీద ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం అలాగే ఇర్రిగేషన్ శాఖ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ విషయంలో అంటే హైడల్ ప్రాజెక్టుకీ అలాగే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు సంబంధించిన ఒకే కాంపోనెంట్ గా తీసుకొని రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రెండిటినీ విడివిడిగా చూడాలా, లేక పోతే రెండిటినీ విడగొట్టి హైడల్ ప్రాజెక్టు వరకూ సపరేట్ గా ఆగిపోయి మిగిలిన హెడ్ వర్క్స్ కి సంబంధించిన రివర్స్ టెండరింగ్ వ్యవహారానికి సంబంధించి ముందుకెళ్లాలన్న అంశంలో ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు హైడల్ ప్రాజెక్టు కు సంబంధించిన వ్యవహారం నిలిచిపోయినట్లు భావించాల్సి ఉంటుంది.  హెడ్ వర్క్సు సంబంధించి కేంద్రం ఆధీనంలో ఉంది, హైడల్  ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న పరిస్థితి.


పీపీఏ అనుమతులు తీసుకుంటాము,  పీపీఏ ఏ అభ్యంతరాలనైతే లేవనెత్తిందో వాటన్నిటినీ పూర్తి స్థాయిలో క్లారిటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖకి సంబంధించిన అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. మళ్లీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించి మళ్లీ పనులను ప్రారంభించడం జాప్యమవుతోంది. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవచ్చు అన్న అనుమానాన్ని పీపీఏ తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే పీపీఏ అథారిటీ సమావేశంలో ఈ అంశానికి సంబంంధించిన అభ్యంతరాలను లేవనెత్తడంతో పాటుగా ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా,టెండర్ లు పిలవటానికి ఒక రోజు ముందుగా లేఖ కూడా రాసింది. కేంద్రం అలాగే పీపీఏ అథారిటీ ఒక తుది నిర్ణయం తీసుకునేంత వరకూ ఎటువంటి టెండరింగ్ ప్రక్రియ చేపట్టవద్దని రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దని పీపీఏ కూడా కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టెండర్ లకు వెళ్లాల్సిందే, వెళ్లిన తరువాత ఎటువంటి జాప్యం లేకుండా అనుకున్న సమయానికే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అలాగే పీపీఏకి స్పష్టంగా క్లారిటీ ఇస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

polavaram-project
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.