సహజీవనం నగరాల్లో నివసిస్తున్న వారికీ ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో నివసించే వారందరికీ అని చెప్పను కానీ మన పూర్వీకులకు ఈ సహాజీవనం గురించి చెప్పాము అంటే కొట్టడానికి వస్తారు. అలంటి స్వదేశీ సంప్రదాయం ఈ సహజీవనం సంప్రదాయం. ఇంకా విషయానికి వస్తే సహజీవనంపై సుప్రీం కోర్టు సంచలన తిరుపునిచ్చింది.                


ఆ సంచలన తీర్పు గురించి తెలుసుకునే ముందు అసలు సహజీవనం అంటే ఏంటో తెలుసుకోండి నేటి తరం యువత. సహజీవనం అంటే అమ్మాయి, అబ్బాయి ఇష్టాలను ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించకుండా ఒకే ఇంట్లో శారీరకంగా, మానసికంగా కలిసిఉండడాన్ని సహజీవనం అని అంటారు.              


ఈ సహజీవనం సంప్రదాయాన్ని స్వదేశీలు ఇలా పాటిస్తారు. కానీ మన దేశ యువత దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి ఇంట్లో వారు ఉండి, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోకుండా, ఒకరి ఆలోచనలను ఒకరు తెలుసుకోకుండా, ఒకరిపై ఒకరు పెత్తనం చేస్తూ కేవలం శరరీక సంబంధాన్ని పెట్టుకొని దాన్ని సహజీవనం అని అంటుంది ఈ నాటి తరం.        


ఇలాంటి చెత్త పనులు చేస్తూ దానిని సహజీవనం అంటూ .. కోర్టు మెట్లు ఎక్కుతున్నరు యువతీ యువకులు. ఈ తరహాలోనే ఓ యువతీ తనతో ఆరేళ్ళు సహజీవనం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టేస్తూ 'ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అది అత్యాచారం కిందకు రాదని' సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: