ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం నిన్న రాత్రి అరెస్టు అయినా సంగతి తెలిసిందే. చిదంబరన్నీ రాత్రి ఢిల్లీలో ని సీబీఐ కార్యాలయంలో ఆయన్ని విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా చిదంబరాన్ని అరెస్ట్ చెయ్యడానికి సిబిఐ ఎదురుచూసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సిబిఐ అరెస్ట్ చేసి ఢిల్లీలోనే సీబీఐ కార్యాలయంలో ఆయన్ని విచారిస్తున్నారు. 


ఇక్కడ విచిత్రం ఏంటంటే చిదంబరం ప్రారంభించిన సీబీఐ కార్యాలయంలోనే ఆయన్ని విచారిస్తున్నారు. కాగా సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం చిదంబరం హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యాడు.. ఇప్పుడు అమిత్ షా హోమ్ మంత్రి అయ్యాడు చిదంబరం అరెస్ట్ అయ్యాడు.. దీంతో 9 యేళ్ళనాటి అమిత్ షా పగ తీరింది అంటూ సోషల్ మీడియా వేధికగా కామెంట్లు వస్తున్నాయి. 


ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ సంచలన ట్విట్ చేస్తూ '2011 జూన్‌ 30న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ఆయన సీబీఐ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఒకప్పుడు కేంద్ర మంత్రి హోదాలో వచ్చిన ఆయన ఇప్పుడు నిందితుడిగా విచారణ ఎదుర్కోవడం ఆసక్తిగా మారింది.' అంటూ సంచలన ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: