జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హై కోర్టు మొట్టమొదటిసారిగా పెద్ద షాకే ఇచ్చింది. పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ముందుకెళ్ళవద్దంటూ తాజాగా ఆదేశించింది. నవయుగ కంపెనీకి హైడల్ ప్రాజెక్టును రద్దు చేస్తు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సస్పెండ్ చేసింది. హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ వాదన కోర్టులో వీగిపోయింది. కంపెనీ వాదనకే కోర్టు కూడా మద్దతుగా నిలవటం గమనార్హం.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హైడల్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం తాజగా విధించిన గడువుకన్నా  గత ప్రభుత్వంతో ఇదే కంపెనీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ఇంకా ముందే పూర్తవ్వాలి. జగన్ ప్రభుత్వం చెబుతున్నదానికన్నా ఇంకా ముందే తాము పూర్తి చేస్తామని చెప్పినా జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఫిర్యాదు చేసింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కూడా నవయుగ కంపెనీ కోర్టు ముందుంచింది.

 

రెండు వైపుల వాదనలు విన్న కోర్టుకు నవయుగ కంపెనీ వాదనే సబబుగా అనిపించింది. దాంతో కంపెనీ వాదనకే కోర్టు కూడా మద్దతుగా నిలవటంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లుగానే భావించాలి. నిజానికి రివర్స్ టెండరింగ్ విధానంతో ముందుకు పోవాలని జగన్ అనుకున్నపుడు న్యాయపరమైన అంశాలను కూడా ముందుగానే ఆలోచించుండాలి. న్యాయసమీక్ష విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు అంతా పక్కాగా ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని జగన్ మరచిపోయినట్లున్నారు.

 

న్యాయపరంగా ఎదురయ్యే సమస్యల గురించి ముందుగా ఆలోచించకుండా టెండర్లు రద్దు చేయటంతోనే జగన్ కు ఇపుడు షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తగిలిన మొట్టమొదటి కోర్టు షాక్ ఇదే. ఒకేసారి చాలా అంశాలను జగన్ నెత్తికెత్తుకున్నారు. దాంతో అన్నీ సమస్యలు ఒక్కసారిగా ముంచుకొస్తున్నాయి. తాజాగా కోర్టు షాక్ తో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: