Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 7:40 pm IST

Menu &Sections

Search

నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం!

నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం!
నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పడు పట్టణాల్లో వెస్టన్ కల్చర్ వచ్చి సంగీతాన్ని చిందరవందర చేస్తున్నాయి.  కానీ ఒకప్పుడు పల్లెపాటలు ఆ సంగీతం వింటుంటే ఎంతో వినసొంపుగా ఉండేది.  పల్లె పాటలకు ఎప్పటి నుంచో ఆదరణ ఉండేది..కానీ ఈ మద్య ఆ కళలు అంతరించిపోతున్నాయనే చెప్పాలి.  జానపద కళలలు అంతరించి పోకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ప్రపంచ జానపద కళల దినోత్సవం జరుపుకుంటారు.  సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.

అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి. ఆంధ్రుల వికాసం లో జానపద కళలు భావమయ్యాయి . ఇవి జనజీవన సంస్కృతికి ప్రతిబింబాలు . జీవన సమరం లో సుఖదు:ఖాలను బాణీలుగా చేసుకొని వెలసిన జానపదాలు .... విజ్ఞాన , వినోదాలను పంచేవి గా ఉన్నాయి . జానపదం అంటే పల్లె , పల్లె జనాలు పాడుకునే పాటలు , ఆటలు , నృత్యాలు , సామెతలు ఈ కోవకిందకు వస్తాయి . ఉత్తరాంద్రకే వన్నె తెచ్చిన " తప్పెటగుళ్ళ " , శ్రీకాకుళం గిరిజన రైతాంగ పొరారటం లో సరికొత్త రుపాన్ని సంతరించుకొన్న " జముకు" కళారూపము జానపదకళల ప్రాశస్త్యానికి మచ్చుతునకులు.  ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఖచ్చితంగా ఓ జానపద సాంగ్ ఉండేవి..ఆ పాటలు హైలెట్ గా ఉండేది. 

కానీ ఇప్పుడు అలాంటి పాటలు మాట వరుసకైనా ఉండకుండా పోతున్నాయి. మన ప్రాచీన సాంస్కకళలు 64 రకాలుగా విభజించారు.వీటిలో ప్రధానమైనవి సంగీతం,నాట్యం,నాటకం, కవిత్వం. మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి. గ్రామాల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు నాటి రాజుల చరిత్రను, భాగవతం, రామాయణం, హరికథలతో పాటు, పద్యాల రూపంలో అందులో విషయాలను వివరించేవారు.

అమ్మ లాలిపాట బిడ్డ ఆకలిని మరిపిస్తుంది...జోల పాట నిద్రదేవి ఒడిలోకి చేరుస్తుంది. పాటకున్న శక్తి అటువంటిది. మాట నుంచి పాట ఉద్భవిస్తే పాటకు సంగీతం జతకలిసి కళగా రూపాంతరం చెందింది. మన ముందు తరాలవి శ్రమైక జీవనం. కష్టజీవులే ఎక్కువ మంది. రోజంతా కాయకష్టం చేసి ఇళ్లకు చేరిన వారి అలసట తీర్చి వారికి సాంత్వన చేకూర్చే కళా రూపాలే జనపదాలు. చిందు, యక్షగానం, గౌడ శెట్టిల గౌడపురాణం, ఎనూటి వారి పటం కథ లు, మంద హెచ్చు కథలు, కొమ్ములవారి కథలు, పొడప్రొతుల కథలు, ఝం జ కథలు, విప్రవినోదులు, బైకాని కథలు, సాధనా శూరులు, పిచ్చకుం ట్లవారు, కాకి పడిగల పంట కత, గుర్రం పటం కథ, మాచయ్య పటం కథలు, గంచీ కూటిపటం కథలు, కొర్రొజులోటి కథలు, ఆడేంఎల్లయ్య కథ లు, పూజారి పటం కథలు, డోలి, పట్టి కథలు ప్రధానమైనవి. పని...పాటది విడదీయరాని బంధం.

జానపదాలు పల్లెవాసుల గుండె చప్పుడు. జన జీవనంలో, జాతి సాంస్కృతిక వారసత్వంలో అత్యంత కీలకమైన అభివ్యక్త రూపాలు జానపద కళారూపాలు. తెలంగాణ జానపద కళలకు తరగని ఖజానా అన్న ఈ విషయాన్ని పురస్కరించుకొని 2015 నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు జానపద జాతర అని పేరు పెట్టారు.  బుడగ జంగాలు, గంగిరెద్దులవాళ్లు, చెంచులు సగం రాత్రివాళ్లు, జంగాలు, పాముల వాళ్లు, హరికథా దాసులు, ఎర్రగోళ్లు వారు ఇలా చెప్పుకుంటూ చాలా మంది జానపద పాటలను, వేదాల్లోని సారాంశాన్ని పాటల ద్వారా పలికిస్తూ జీవనం సాగించేవారు.

1. ఇతిహాసము
 2. ఆగమము 
3. కావ్యం 
4.అలంకారం 
5.నాటకం 
6.గాయకత్వం
 7.కవిత్వం
 8. కామశాస్త్రం 
9. దురోదరం జ్ఞానం 
10.దేశభాషలిపి 
11.లిపికర్మం 
12.వాచకం 
13.అవధానం
14.సర్వశాస్త్రం 
15.శాకునం 
16.సాముద్రికం 
17.రత్నశాస్త్రం 
18.రథాశ్యాగజ కౌశలం 
19.మల్ల శాస్త్రం
20.సూదకర్మం 
21.దహదం 
22. గంధవాదం 
23. ధాతువాదం 
24. ఖనివాదం 
25. రసవాదం
26. జలవాదం 
27. అగ్ని స్తంభం
 28. ఖడ్గ స్తంభం 
29. జలస్తంభం
 30.వాక్ స్తంభం 
31. వయ స్తంభం 
32. వశ్యం 
33. ఆకర్షణం 
34. మోహనం 
35. విద్వేషం 
36. ఉచ్చాటనం 
37.మారణం
38. కాలవంచనం
39. పరకాయప్రవేశం 
40. పాదుకాసిద్ధి 
41. ఐంద్రిజీవితం
 42. అంజనం 
43.దృష్టి చనం 
 44.సర్వ వంచనం 
45. మణి మంత్రేషధాదిక సిద్ధి
 46. చోరకర్మం 
47. చిత్రక్రియ 
48. లోహక్రియ 
49. అశ్వక్రియ 
50.మృత్ర్కియ
 51. దారుక్రియ 
52. వేణుక్రియ 
53. చర్మక్రియ 
54. అంబరక్రియ
 55. అదృశ్యకరణం 
56. దూతీకరణం
57. వాణిజ్యం 
58. పాశు పాలనం
 59. కృషి 
60. అసవకర్మం
 61. ప్రాణిదూతృత కౌశలం 
62. వాక్సిద్ది 
63. చిత్రలేఖనం 
64. సంగీతం 

జానపద కళలు : భారత గ్రామీణ ప్రాంతం లో ఇవి ఎక్కువ ప్రాచుర్యం కలిగిఉన్నాయి .
ఉరుము నృత్యము, ఒగ్గు కథ, కోలాటం, గొరవయ్యలు, జ్యోతినృత్యం, తెలుగునాట చోది చెప్పడం , తెలుగునాట జానపద ఉడుపు పాటలు , తోలుబొమ్మలాట, పగటి వేషాలు, బుట్టబొమ్మలు, బుర్రకథ, యక్షగానం, రికార్డింగ్ డాన్స్, హరికథ-హరిదాసు,డప్పు, తప్పెట గుళ్ళు, జముక గిరిజ నృత్యము , లంబాడీ, బోనాలు, ధింసా, కోలాటం, జ్యోతి నృత్యం, ఉరుము నృత్యం, కత్తిసాము,కర్రసాము, కొమ్ము కథ, కొమ్ముల నృత్యం లేదా రేలా నృత్యం, గరగలు, గరిడి, గాన కళారూపం ఒగ్గు కథ, గురవయ్యలు, గొండ్లి నాట్యం, గొల్ల సుద్దులు, చెక్కభజన, యక్షగానం, చిందు యక్షగానం, చెంచు భాగవతం, చెక్కబొమ్మలాట, జడకోలాటం (కులుకుభజన), జిక్కికి, డప్పులు, తంబుర (కడ్డీ తంత్రి), పగటి వేషాలు, పల్లెసుద్దులు, పులివేషాలు, పొంబల వాయిద్యం,మరగాళ్ళు, రాయలసీమ కొరవయ్యల నృత్యం, లవకుశల, వగ్గుడోళ్ల విన్యాసం, వీధి బాగోతం, వీరనాట్యం, వీరభద్ర విన్యాసం,శ్రీ కాళీమాత నృత్యం, కోయ నృత్యము, బుడబుక్కల పాట , గంగిరెద్దులు వారు ,బుట్ట పాములు ఆటవారు ,చెంచు వారి పాటలు , జంగాల వారి పిట్టకథలు.  శ్రమైక జీవనం నుంచి ఆవిష్కరించిన ఈ కళలు అనేక రూపాలుగా విలసిల్లి వర్థిల్లాయి. సంస్కృతి సత్సంప్రదాయా లను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ దేశ విదేశాల్లో గుర్తింపు పొందాయి.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.