ఆంధ్ర ప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు మీద రోజురోజుకి ఒక కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా హై కోర్ట్ రివర్స్ టెండరింగ్ పై స్టే ఇవ్వడంతో జగన్ సర్కార్ కు చుక్కెదురైంది. ఈ అంశం పై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ పై హై కోర్టు స్టే విధించడం పై మాజీ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూర్ఖంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం రీ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.


ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్న వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టెండర్ లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రమంత్రి గడ్కరీ కూడా ఎన్నోసార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలయితే ప్రాజెక్టు నిర్మాణం పై తీవ్ర ప్రభావం పడుతుందని తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరం ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో తెలీయడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రివర్స్ ట్రెండింగ్ పై హై కోర్టు తాజా ఉత్తర్వులపై స్పందించారు మాజీ సీఎం చంద్రబాబు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని ప్రశ్నించారు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం చెబుతున్న కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: