వాతావరణం రోజుకో రకంగా మారుతున్న పరిణమాలకు కారణంగా తెలంగాణ పల్లె ప్రజలు మంచం పట్టారు. విషజ్వరాల బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోగా వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విజృంభిస్తున్న డెంగ్యూ బాధితులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు పారిశుధ్య లోపంతో వెక్కిరిస్తున్న గ్రామాలు, పల్లెల వైపు చూడని అధికారులు ఏ ఇంట్లో చూసినా విష జ్వరాల బాధితులే ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కొందరైతే వైద్యం అందక నరక యాతన అనుభవిస్తున్న వారు మరి కొందరు. ఇది తెలంగాణ జిల్లాల్లో ఉన్న పరిస్థితి. భారీ వర్షాలకు తోడు పారిశుధ్య లోపంతో దోమలు విపరీతంగా పెరిగాయి.



దీంతో ఈ గ్రామాల్లో డెంగ్యూ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. పీహెచ్ సీల నుంచి మొదలు కొని జిల్లా ఆసుపత్రుల వరకు విషజ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆకస్మాత్తుగా పడిపోతున్న ప్లేట్ లెట్స్ ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. విషజ్వరాలతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇంటికొక బాధితుడు ఉన్నాడు. ఒక్క ఖమ్మం ఏరియా ఆసుపత్రిలోనే ఎనభై మందికి పైగా డెంగ్యూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అంతకు రెట్టింపు అని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో డెంగ్యూ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇరవై నాలుగు గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.



విషజ్వరాలతో జనం బాధ పడుతున్న కానీ అధికారులు వాఇ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రక్షిత మంచి నీరును అందించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. జాగ్రత్తలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు తప్ప మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని వారు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: