ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను కోర్టు ముందు హాజరుపరిచారు సిబిఐ అధికారులు. ఆయనను ఏడు నుంచి పదిహేను రోజుల వరకూ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కోర్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు చిదంబరంకు బెయిల్ కోసం కూడా ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సిబిఐ అరెస్టు చేసింది.



అరెస్ట్ తర్వాత ఆయన్ను విచారించింది. అయితే విచారణలో చిదంబరం అన్నింటికీ కూడా స్పష్టమైన సమాధానాలు చెప్పనట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఆయనకు ఇరవై ప్రశ్నలు సంధించడం జరిగింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఎలా తెలుసు అనే దానికి ఆయన చిదంబరం సమాధానం చెప్పలేదన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించి మరి కొన్ని ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి చిదంబరం అస్పష్టంగా సమాధానం చెప్పారు.



కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు చిదంబరంను కోర్టుకు హాజరుపరిచారు. ఆయన్ను వారం రోజుల నుంచి రెండు వారాల వరకు కూడా కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. మరోవైపు చిదంబరంకు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు కూడా ప్రయత్నిస్తున్నారు. కోర్టుకైతే చిదంబరం భార్య చేరుకున్నారు. అయితే ఈ స్కామ్ లో తన ప్రమేయం లేదంటూ కూడా మొదట్నుంచీ చిదంబరం వాదిస్తున్నారు.



అదే విధంగా తన కుమారుడి వ్యాపార వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని చిదంబరం చెప్తూ వస్తున్నారు. చిదంబరంకు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన న్యాయవాదులయితే ఒక వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీబీఐ కూడా ఆయన కస్టడీ కోరబోతుంది. కస్టడీ ఇస్తుందా కోర్టు ఇస్తే ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతించే అవకాశం కన్పిస్తుంది లేదా మరోవైపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా చిదంబరంకు బెయిల్ లభిస్తుందా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: