ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు.  ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతున్నాయో తెలుసుకోలేకపోతున్నారు.  వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.  వాతావరణ మార్పుల కారణంగా ధ్రువప్రాంతంలో ఉండే మంచు కరిగిపోతున్నది.  వాతావరణంలో కర్బన పదార్ధాలు పెరిగిపోతున్నాయి.  ఈ కర్బన పదార్ధాల కారణంగా ఎండలు పెరిగిపోవడంతో పాటు అకాలంగా వర్షాలు కురవడం వంటివి జరుగుతున్నాయి.  


ఉత్తర ధృవంలో ఐస్ ల్యాండ్ ఉన్నది.. ఆ ఐస్ ల్యాండ్ లో ఒకుకూల్ అనే మంచునది ఉండేది. ఇది కరిగి సముద్రంలో కలిసిపోయినట్టు శాస్త్రవేత్తలు ఈనెల 18న షాకింగ్ ప్రకటన చేశారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణం దెబ్బతిని ఇలా హిమానీ నదం కరిగిపోయిందని శాస్త్రవేత్తలు వివరించారు.  దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందటం మొదలుపెట్టారు.  


కేవలం ఒక్క ఐస్ ల్యాండ్లోనే కాదు.. దానిపైనున్న గ్రీన్ ల్యాండ్ లో కూడా అనేక మంచు నదులు ఉన్నాయి.  ఈ మంచు నదులు కూడా ఇప్పటికే చాలా మంచు నదులు కరిగిపోయాయి.  మరికొన్ని కరిగి సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధం అయ్యాయి. కేవలం ధృవప్రాంతంలో మాత్రమే కాదు.. ఇండియాలోని హిమాలయాల్లోని మంచు కరిగిపోయి సముద్రంలో కలిసిపోతోంది.  


ఇలా సముద్రంలో కలిసిపోవడం వలన సముద్రంలో నీటి శాతం పెరుగుతుంది.  ఇలా పెరిగిపోవడం వలన తీరప్రాంతంలోని నగరాలైన కోల్ కతా, చెన్నై, తిరువనంతపురం, ముంబై వంటి నగరాలకు ముంపు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  కేవలం ఒక్క ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లోని నగరాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నది.  భూమిపై ఒత్తిడి కారణంగా భూమిలోపల ఉన్న పలకకు రాపిడికి గురైనపుడు సునామి వంటివి వస్తున్నాయి.    ఈ సునామి వంటి వాటి వలన ఎన్నో నగరాలకు ముప్పు రావొచ్చు.  2004లో వచ్చిన సునామి కారణంగా ఎన్ని దేశాలు అతలాకుతలం అయ్యాయో తెలిసిందే.  వేలాదిమంది ప్రజలు మృత్యువాత పడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: