సన్నబియ్యం తినాలంటే కార్లో తిరిగే వారే కావాలా. వైట్ కాలర్ జాబ్ హోల్డర్లే అయి  ఉండాలా. బాగా బలిసిన దేహాలకే అవి అరుగుతాయా. మేడలు, మిద్దెలు ఉన్న వారినే అవి పలకరిస్తాయా. నిజమే అని చెప్పాలిక్కడా. ఎందుకంటే తరతరాలుగా జరుగుతున్న కధ ఇది. సన్న బియ్యం తింటూ నాజూకుతనం పోతూ మేము ఉన్నతులం అని చెప్పుకునే జనాభా నూటికి పది శాతమే ఉంది. వారు అన్ని విధాలుగా గొప్పవారమని అనుకుంటున్నారు.


ఇపుడు ఆ అవకాశం పేదలకు కూడా పంచిపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడీ అయ్యారు. ఆయన ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు సన్న బియ్యం గింజలు  తొందరలోనే పేదింటి ముంగిట్లో జలజల రాలనున్నాయి. దుడ్డు బియ్యం తింటూ అరగక లేని పోని కడుపునొప్పులు తెచ్చుకుంటున్న బీదా బిక్కీకి ఇకపై సన్న బియ్యం అందించాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. జగన్ నవరత్నాల్లో హామీ సందర్భంగా ఇపుడు దీన్ని నెరవేర్చేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు.


బహిరంగ మార్కెట్లో నలభై, యాభై రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని కిలో రూపాయికే జగన్ ఇవ్వబోతున్నారు. ఒక మనిషికి అయిదు కిలోల వంతున  సన్నబియ్యం అందచేయాలని నిర్ణయించారు. తెల్ల రేషన్  కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఈ సన్న బియ్యం అందుతుంది. ఇందుకోసం భారీఎత్తున కసరత్త్తు జరుగుతోంది. 


సన్నబియ్యం ప్యాకింగులను రెడీ చేసి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ జగన్ ఇవ్వబోతున్నారు. ఆ ప్యాక్ మీద‌ జగన్, వైఎస్సార్ బొమ్మలను ముద్రించి వుంచారు. వీటిని అందుకోవడం ద్వారా పేదింటిలో వెలుగులు కనిపిస్తాయని వైసీపీ సర్కార్ ఆశాభావంతో ఉంది. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఈ బియ్యం అందరికీ అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద జగన్ సన్నబియ్యం అందించడం ద్వారా వివక్షగా పడి ఉన్న పేద కులానికి పెద్ద పీట వేస్తున్నారనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: