మరోసారి కుదేలైన స్టాక్ మార్కెట్

 చిన్నమదుపర్ల  పాలిట కల్పవృక్షం,  స్టాక్ బ్రోకర్ యొక్క  జీవనాడి అయినా మన స్టాక్ మార్కెట్ మరోసారి కుప్ప కూలి పోయింది.   కోట్లాది రూపాయల చిన్న మదుపరుల సంపద ను ఆవిరి చేస్తూ బీఎస్సీ సన్ సెక్స్  587 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 177 పాయింట్లు నష్ట పోయింది.

 అంతర్జాతీయ మార్కెట్లో అంత సానుకూల సంకేతాలు లేక పోవడం, బ్యాంకింగ్ రంగ షేర్లు  అమ్మకాల ఒత్తిడికి గురి కావడం ఈ రోజు ఈ భారీ పతనాని కి ముఖ్య కారణాలుగా చెప్పు కోవచ్చు. చాలా నెమ్మది గా ప్రారంభమైన ఈనాటి ట్రేడింగ్ ఏ దశలోనూ లాభం దిశగా పయనించే లేదని చెప్ప వచ్చు. ఈ రోజు మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించడమే  సూచీలు నష్టాల్లో ప్రారంభించాయి.  

 బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురికావడం ఒకవైపు,  అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సానుకూలం గా లేక పోవడం మరోవైపు మన స్టాక్ మార్కెట్ ను  ఈ రోజు దెబ్బతీశాయి. ఈ రోజు ట్రేడింగ్లో లాభ పడిన షేర్లు టెక్ మహీంద్రా, టిసిఎస్, బ్రిటానియా  మొదలగునవి కాగా, నష్ట పోయినవి ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, bajaj finserv, వేదాంత మొదలగునవి.   ఈ సందర్భం గా చిన్న మదుపరులు ఆచి తూచి అడుగు వేయాలి అని పేరు మోసిన స్టాక్ బ్రోకర్ విజ్ఞప్తి.



మరింత సమాచారం తెలుసుకోండి: