గత ప్రభుత్వం లో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 6,032 ఇళ్ల ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటి లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం లో ( చిత్తూరు జిల్లా ) పేదలకు కేటాయించిన 2000 ఇళ్ళు కూడా ఉండటం విశేషం. వివిధ కారణాల తో అవసరమైన భూమి అప్పగించకపోవడం, ప్రాజెక్టు చేపట్టేందు కు  భూమి లభ్యత లేకపోవడం, టెండర్లు ఖరారు కాకపోవడ తదితర కారణాలతో ఈ  ఇళ్ల ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


కుప్పం లో రెండు వేల ఇళ్ళతో పాటు విశాఖపట్నం జిల్లా చోడవరం లో 3,936, కృష్ణా జిల్లా కురుమద్దాలి లో 96 ఇళ్లను కూడా రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ గత ప్రభుత్వం లో మంజూరు చేసినవే. ఈ మేరకు తగుచర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇది కక్ష సాధింపు చర్యే అని, తమ పార్టీ కి మంచి పేరు రాకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇదని ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ఆరోపిస్తుంది. 


చంద్రబాబు నాయుడు ని వరుస గా గెలిపిస్తున్న కుప్పం ప్రజల మీద ప్రభుత్వం కత్తి కట్టిందని టీడీపీ ఆరోపిస్తుంది. పేద ప్రజల తరఫున తాము పోరాటం చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని టీడీపీ నాయకులు అంటున్నారు. 1989 నుండి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కుప్పం నుండి ఏడు సార్లు పోటీ చేశారు. అప్పటి నుండి ఆయన గెలుస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి మాత్రమే ఆయన గత సారి కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: