వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు కోసం ఏకంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.  ఇందులో భాగంగా ఆగష్టు 15 వ తేదీన 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించింది.  అందరికి సమన్యాయం చేస్తానని చెప్పిన వైకాపా ఆ తరువాత గ్రామ వలంటర్ల విషయంలో మాత్రం సొంత కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.  ఈ ఉద్యోగాలకు రాతపరీక్షలు లేవు కాబట్టి రికమండేషన్ వర్కౌట్ అయ్యింది.  


ఇదిలా ఉంటె, 90 శాతం మందికి ఉద్యోగాలు ఇలానే వచ్చాయి. మరో కొన్ని రోజుల్లో వైకాపా మిగిలిన ఉద్యోగాలను కూడా ఇలానే భర్తీ చేయబోతున్నది.  ఇది వేరే విషయం అనుకోండి.  ఇప్పుడు మరో కొత్తపథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది వైకాపా.  అదేమంటే.. జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలు.  గ్రామాల్లో లైన్ మెన్ ఉద్యోగాలు ఉన్నాయి.  వీరికి సహాయంగా జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  


దాదాపు 50 వేల పైచిలులు ఉద్యోగాలను ఈ విధంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  దీనికి కూడా రాత పరీక్షలతో సంబంధం లేదు.  కాబట్టి వైకాపా ఈ ఉద్యోగాల కోసం తన పార్టీ కార్యకర్తలకు కేటాయించబోతుంది అన్నది ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది.  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ డైరెక్ట్ గా ఇలాంటి కొన్ని పధకాలు ప్రవేశపెట్టి వాటిల్లో ఆ పార్టీ కార్యకర్తలను నియమించింది.  


కాకపోతే ఇప్పుడు వైకాపా ఉద్యోగాల పేరుతో వీటిని పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తోంది.  త్వరలోనే జూనియర్ లైన్ మెన్ లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నది.  ఈ నోటిఫికేషన్ రిలీజైన వెంటనే మరోమారు నిరోద్యోగ పార్టీ కార్యకర్తలు అప్లై చేసుకోవచ్చు.  హ్యాపీగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు.  నిజమైన నిరుద్యోగులు మాత్రం అలాగే ఉండిపోతారు అనడంలో సందేహం అవసరం లేదు.  ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వారి కార్యకర్తలే లాభపడతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: