భూగోళానికి ముప్పు వాటిల్లిందని, సకల ప్రపంచం ఇక ఊపిరాడక గిలగిలలాడి బోతోందని, విధ్వంసం కన్నా ప్రమాదకరంగా వినాశనం వాటిల్లబోతుందని అంటున్నారు పర్యావరణవేత్తలు. అవును ఖచ్చితంగా ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు ఈ వార్త విని ప్రపంచం ఉలిక్కిపడింది. అసలు విషయానికొస్తే భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణవాయువును అందించే అమెజాన్ అడవులు. నిత్యం అంటుకుంటూనే ఉంటున్నాయి. బ్రెజిల్ కు చెందిన ఆ అడవులు ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో దగ్ధమవుతున్నాయి.


ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ తాజాగా ఓ డేటాను రిలీజ్ చేసింది. గత ఏడాది అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎనభై నాలుగు శాతం పెరిగినట్లు ఆ ఏజెన్సీ పేర్కొంది. అమెజాన్ అడవుల్లో నరికివేత ఎక్కువైనట్లు ఇటీవల ఆ ఏజెన్సీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అయితే దీనిని ఆ దేశ అధ్యక్షుడు ఖండించారు. కానీ సోమవారం రోజున కూడా భారీ స్థాయిలో అమెజాన్ అడవుల నుంచి నల్లటి పొగ వ్యాపించింది.


అది సావో పౌలో నగరాన్ని కమ్మేసింది. పగటి పూట కూడా ఆ పొగ కమ్మేయడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. సుమారు రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెజాన్ రెండోనియా రాష్ట్రాల్లో అంటుకున్న అడవుల వల్ల సావో పౌలో లో మబ్బు కమ్ముకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యవసాయం కోసం అడవులు నరికివేసేందుకు రైతులకు అనుమతి ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు పర్యావరణవేత్తలు అంటున్నారు.


కానీ, అమెరికాకు చెందిన నాసా మాత్రం మరో రిపోర్ట్ ఇచ్చింది. అమెజాన్ అడవుల్లో చేలరేగుతున్న మంటలు సగటు కన్నా తక్కువ గానే ఉన్నాయని పేర్కొంది. అమెజాన్ రెండోనియా రాష్ట్రాల్లో అగ్ని సంఘటనలు పెరిగినా మాటో, గ్రాస్సో, పారా జిల్లాల్లో మాత్రం కార్చిచ్చు ఘటనలు తగ్గినట్లు నాసా చెప్పింది. అడవులు కాలిపోతున్న దృశ్యాలు అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.


మరింత సమాచారం తెలుసుకోండి: