తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి  శుభాకాంక్షలు చెబుతూ ఆకాశానికెత్తేశారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించారని, అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.


ఈ సందర్భంగా హూద్ హూద్ తుఫాన్ నేపథ్యంలో తెలుగు సినిమా వాళ్ళు చేసిన ఓ ఈవెంట్ లో చిరంజీవితో కలసి సంతోషంగా గడిపిన ఒక ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు. అయితే ఆయన శుభాకాంక్షలు చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ అంతకముందు ఆయన ఇలా శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు పెద్దగా లేవు. ఒకవేళ చెప్పిన ఈ స్థాయిలో చిరంజీవిని పొగుడుతూ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పారో, అంత సడన్ గా చిరంజీవి మీద బాబుకి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్ధంకావడం లేదు.  


ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో చంద్రబాబు ఏ విధంగా చిరంజీవికి డ్యామేజ్ చేశారో అందరికీ తెలుసు. ఆ పార్టీని దెబ్బకొట్టి కాపు నేతలనీ తనవైపుకు తిప్పుకున్నారు. ఇక మొన్న 2014 ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని వాడుకుని అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆయన్ని పక్కకి పెట్టేశారు. అయితే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కల్యాణ్ కి దగ్గర అయ్యి కాపు ఓట్లని దక్కించుకోవాలని చూశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిందే. కాపులు జనసేనకి, వైసీపీకి ఎక్కువ మద్ధతు పలికారు. టీడీపీకి దూరమైపోయారు.


ఇలాంటి సమయంలో చిరంజీవి మీద సడన్ చంద్రబాబుకు ప్రేమ వచ్చేసింది. పుట్టినరోజుకు ఆయనపై పొగడ్తల వర్షం కురిపించేశారు. ఇదంతా చూస్తుంటే బాబు మళ్ళీ కాపులకు దగ్గర అవ్వాలని చూస్తున్నారనే డౌట్ వస్తుంది. అలాగే పవన్ కల్యాణ్ ని కాక పడుతున్నారేమో అనిపిస్తోంది. ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మద్ధతు భవిష్యత్ లో తీసుకోవచ్చనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాబు అవసరం లేకుండా మాట కూడా మాట్లాడరు కదా! అలాంటిది బాబు సడన్ ప్రేమ వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉన్నట్లు అర్ధమవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: