ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చి రెండున్నర నెలలు దాటింది గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట యాభై ఒకటి వైసీపీ గెలుచుకుంది. సునామీ తరహా విజయానికి సరైన నిర్వచనంలా నిలిచింది వైసిపీ. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లందరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఇరవై ఐదు మంది మంత్రుల్లో కొందరు సీనియర్లకు చోటు కల్పించడం సాధ్యం కాలేదు. దీంతో కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కొందరిని ప్రభుత్వ విప్ లుగా నియమించారు. అయితే మంత్రివర్గ కూర్పు సమయంలోనే సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం పూర్తిస్థాయిలో మారుస్తానని, ఆ తర్వాత మరికొంతమందికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.


అంటే తన క్యాబినెట్ లో తొంభై శాతం మార్పులుంటాయని ఆ రోజే సంకేతాలు పంపారు. దీంతో రెండున్నరేళ్ల తర్వాత జగన్ క్యాబినెట్ లో ఉండే మంత్రులెవరూ, వెళ్లే మంత్రులెవరూ అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఇరవై ఐదు మంది మంత్రులున్నారు. వీరిలో ఐదుగురు బెర్త్ లు మాత్రం ఐదేళ్ళు రిజర్వయ్యాయని తెలుస్తోంది. ఈ అయిదుగురు మంత్రులు ఐదేళ్ళపాటు పూర్తికాలం పదవిలో ఉంటారని సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ అమేరకు హామీ ఇచ్చారని ప్రచారం నడుస్తోంది. ఈ ఐదుగురు మంత్రుల్లో లిస్ట్ లో మొదటి ఉన్న నేత మోపిదేవి వెంకటరమణ. ఈయన మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నియోజక వర్గం నుంచి ఓడిపోయాడు. అయితే తాను పార్టీ పెట్టినప్పటినుంచీ తోడుగా ఉంటోన్న మోపిదేవికి జగన్ మంత్రి పదవును ఇచ్చారు గౌరవించారు.


ఇపుడు అయిదేళ్ల పాటు ఈయన బెర్త్ కు ఢోకా లేదు. కూల్ గా వర్క్ చేసుకోమని జగన్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్ల పాటు సీట్ రిజర్వ్ అయిన మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈయన కూడా మొదట్నుంచీ జగన్ తో పాటే నడిచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీసీ నేత. ఈయన కూడా ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగబోతున్నారని సమాచారం. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్ కు సన్నిహితులు. ఈయన కూడా పూర్తిస్థాయిలో అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండబోతున్నారని సమాచారం. సీమ పార్టీ వ్యవహారాలతో పాటు కృష్ణా, గుంటూరు వ్యవహారాల్లో పెదిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈయన కూడా ఐదేళ్ల పాటు మంత్రిగా ఉంటారని జగన్ భరోసా ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.


వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ ఒకరు. ఉత్తరాంధ్రలో కీలక నేత. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంలో బొత్స పాత్ర ఉంది. దీంతో పార్టీ అవసరాల దృష్ట్యా ఈయనను కూడా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించనున్నారు. జగన్ తో పాటు తొలి నుంచీ నడిచిన మరో నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాలో కీలక నేత. ఈయనకు కూడా జగన్ భరోసా ఇచ్చారని మాట వినిపిస్తోంది. ఐదేళ్ళపాటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉన్న నేతల్లో ఈయన ఒకరు. మొత్తానికి ఈ ఐదుగురు మంత్రులు ఐదేళ్ల పాటు పూర్తికాలం మంత్రులుగా కొనసాగే ఛాన్సుంది. మిగతా ఇరవై మంది మంత్రుల్ని రెండున్నరేళ్ల తర్వాత మార్చడం ఖాయమని ఓ టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: