చిరంజీవి పుట్టిన రోజు నాడు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి అతనికి శుభాకాంక్షలు వచ్చాయి. అయితే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన శుభాకాంక్షలు మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. చంద్రబాబు అయితే ఏకంగా చిరంజేవి, తాను కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఇక చినబాబు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇలా టీడీపీ చిరంజేవికి శుభాకాంక్షలు చెప్పిందో లేదో .. అభిమానులు కామెంట్స్ రూపంలో ఒకటే సెటైర్ల వర్షం కురిపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన జనసేన సపోర్ట్ టీడీపీకి ఉండదని మెజారిటీ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. నిజానికి ఏ రాజకీయ లబ్ది ఆశించకుండా టీడీపీ అధినాయకుడు ఎవరితోనూ ర్యాంపో మైంటైన్ చేయరు. 


ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత .. జనసేనతో కలిసిపోవాలని టీడీపీ తెగ ట్రై చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఒక ఏడాది ముందు టీడీపీ మీద విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఎన్నికలో ఇటు జనసేన, టీపీడీ పార్టీలు రెండు ఘోరంగా ఓడిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేన, టీడీపీ కలిసి పోతుందా .. అనే సందేహాలు వస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ .. 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబును పెద్దగా విమర్శించింది లేదు. ప్రతి పక్షంలో జగన్ ను మాత్రమే టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ .. ప్రతి పక్షంలో టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. మొన్న మధ్య రాపాక వ్యవహారాన్ని జనసేన ఉపయోగించుకొని జగన్ ను విమర్శించాలని ఆ పార్టీ అధినేత పవన్ కంకణం కట్టుకున్నంటున్నారు. దానికి పచ్చ బ్యాచ్ సపోర్ట్ చేయడం. వీరిద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి పక్షాల మీద దాడులు జారిపోతున్నాయని ప్రాజెక్ట్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ చివరికి అది బెడిసి కొట్టింది. అయితే చూడాలి భవిష్యత్ లో ఏం జరగబోతుందో .. ఎందుకటే రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు .. శాశ్వత శత్రువులు ఉండరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: