తొమ్మిది సంవత్సరాలు కష్టపడి, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలని తెలుసుకుని, ప్రజానాయకుడిగా ఎదిగి జగన్ మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో సీఎం అయిన విషయం తెలిసిందే. ఇక అధికారం చేపట్టిన దగ్గర నుంచి వైసీపీ అధినేత పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తండ్రి, దివంగత నేత వైఎస్సార్ లాగా తను కూడా మంచి పేరు తెచ్చుకుని ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. 


ఈ క్రమంలోనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాలని ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకుని మహనీయుడుగా నిలిచిపోయారో.. అలాగే జగన్ కూడా రాష్ట్ర చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలని భావించి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అందుకే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే గ్రామ సచివాలయాన్ని తెరపైకి తెచ్చారు. లక్షల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ వదిలారు. 


అలాగే యువకులకు సొంత ఊరిలోనే ఉద్యోగం, కనీస ఉద్యోగ భద్రత కల్పించేలా గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చారు. ఇక యువత సంతృప్తిగా ఉంటే ఆ కుటుంబం సంతృప్తిగా ఉన్నట్టే. కొన్ని లక్షల కుటుంబాలు సంతృప్తిగా ఉంటే రాష్ట్రం సంతృప్తిగా ఉన్నట్టే. ఇప్పుడు ఇదే జగన్ కొత్త ఫార్ములా. ఇప్పుడు ఇదే జగన్ ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టే పథకమని తెలుస్తోంది.


అప్పుడు ఆరోగ్య శ్రీ వల్లే వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి రాగలిగారు. అందుకోసం వైఎస్ బాగా కష్టపడ్డారు. పేదలకి ఆరోగ్య శ్రీ అందజేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. దాదాపు అధికారంలో ఉన్నన్ని రోజులు, ప్రతిరోజు ఈ పథకంపై సమీక్ష నిర్వహించేవారు. ఓవైపు జలయజ్ఞం లాంటి భారీ పథకం కొనసాగుతున్నప్పటికీ, ఆరోగ్యశ్రీని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకే ఆయన్ని 2009లో కూడా ప్రజలు గెలిపించుకున్నారు. ఒకవేళ బ్రతికుంటే రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి ఆయనే ఏలేవారు.


ఇక వైఎస్సార్ లాంటి క్రమశిక్షణ, నిబద్ధతనే వైఎస్ జగన్ కూడా చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇతర పథకాలు ఉన్నప్పటికీ.. గ్రామ సచివాలయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా చేయడానికి కష్టపడుతున్నారు. దీంతో ఈ పథకమే జగన్ ని మరో దశాబ్దం పాటు ఏపీని పరిపాలించేలా చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి వైఎస్సార్ లాగే జగన్ కూడా ప్రజల మనసుని గెలుచుకుంటారని అర్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: