చంద్రబాబు నాయుడు .. జగన్ మీద తాజా విమర్శలు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానవు. జగన్ అధికారంలోకి వచ్చి కనీసం మూడు నెలలు కూడా కాలేదు. పాపం బాబు గారు ప్రతి విషయంలో చాలా ఆవేశంగా జగన్ ను విరామర్శించడానికే టైం కేటాయిస్తున్నారు. ఇటు ట్విట్టర్ లో .. మీడియా ముందు ప్రభుత్వాన్ని విమర్శించడమే ఇప్పుడున్న మార్గమని బాబు గారు అభిప్రాయ పడుతున్నారు. అయితే టీడీపీ పార్టీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను అధినేత చంద్రబాబు పసిగట్టిన నేతలను కంట్రోల్ లో పెట్టలేకపోయారు. చివర్లో డబ్బులతో మ్యానేజ్ చేయొచ్చనుకొని ప్రజలను బాబుగారు చాలా తక్కువ అంచనా వేసినారు. అయితే బాబును ప్రజలు విశ్వసించలేదు. సాధారణంగా బాబు గారికి అధికారం లేకపోతే బతకలేరు కాబట్టి ఆవేశంలో జగన్ నీకేమైనా పిచ్చా .. ఎందుకు ఈ మూర్ఖపు చర్యలని విరుచుకుపడుతున్నారు. 


పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు జగన్ సర్కార్ వెళ్లిన సంగతీ తెలిసిందే. దీనితో బాబు గారికి కోపం వచ్చింది. రాష్ట్రానికి శని పట్టిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లలో బాబు గారి పాలనలో శని పట్టింది కాబట్టి ప్రజలు అఖండ మెజారిటీతో జగన్ ను గెలిపించుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాబు గారు గౌరవించి కనీసం 6 నెలలు అయినా ఓపిక పట్టి జగన్ ను విమర్శించినా ఒక అర్ధం ఉంటుంది. లేదూ అంటే ఈ సారి కూడా ప్రజలు తమ ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: