హై కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే విధంగా తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొనబోతోందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అదునుగా తీసుకోని ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ రెచ్చిపోతుంది. చంద్రబాబు అయితే జగన్ మీద పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడిన పరిస్థితి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను రద్దు చేయలేదు. అలాగే మళ్ళీ నవయుగ కంపెనీకి పోలవరం పనులు బాధ్యతలు అప్పగించలేదు. పోలవరం నుంచి నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ కోర్టుకు వెళ్లిన సంగతీ తెలిసిందే. 


నవయుగ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు ..  ప్రభుత్వం నిరూపించాలి. లేదా పోలవరం పనుల్లో  నాణ్యత లోపించిందని ప్రభుత్వం తేల్చాలి. ఆలా చేయని పక్షంలో కోర్ట్ లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని కొంత మంది విశ్లేశించారు. ఇప్పుడు అదే విధంగా ప్రభుత్వానికి తీర్పు వచ్చింది. ప్రస్తుతం పనులు చేబడుతున్న నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఎప్పుడో ఇచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది.


అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెప్పుకొచ్చారు . ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: