టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోమారు బీజేపీపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అమలుచేయడంలేదంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని, ఈ పథకంకంటే ఆరోగ్యశ్రీ అన్నివిధాలుగా మెరుగ్గా ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని వారిని గట్టిగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 


తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డాటా ఎంట్రీ, కమిటీల ఎన్నికలు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల స్థితిగతులపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో అయ్యేదేంలేదని, ప్రభుత్వంపై అసత్యప్రచారంతోపాటు, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్న మాటలతోనే ఆ పార్టీ బలమేమిటో అర్థమవుతున్నదన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీలు స్థానాలు గెలిచిన బీజేపీ.. ఆ తరువాత జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో ఏడు జెడ్పీటీసీలకే పరిమితమైందని గుర్తుచేశారు.  ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అమలుచేయడంలేదంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని, ఈ పథకంకంటే ఆరోగ్యశ్రీ అన్నివిధాలుగా మెరుగ్గా ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని పథకానికి ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు మరో 75 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని తెలిపారు. ఆయుష్మాన్‌భారత్ పథకం కింద 25లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఆరోగ్యశ్రీ కింద 75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. 


ఆగస్టు నెలాఖరుకల్లా పార్టీ కమిటీలన్నింటి ఎన్నికలను పూర్తిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తీసుకొన్న సభ్యత్వ పుస్తకాలను ఈ నెల 25 వరకు తిరిగి ఇచ్చేయాలని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలను దసరానాటికి పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వ నమోదుకు కృషిచేసిన పార్టీ నాయకులను, నియోజకవర్గ ఇంచార్జీలను, డాటా ఎంట్రీ ఇంచార్జీలను కేటీఆర్ అభినందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: